Telugu Global
Others

కొన‌సాగుతున్న వైఎస్ షర్మిల పరామర్శల యాత్ర‌

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన రెండో విడత పరామర్శ యాత్రలో రెండోరోజు నల్గొండ జిల్లాలో కొనసాగనుంది. ఈ రోజు ష‌ర్మిల ఐదు కుటుంబాలను ప‌రామ‌ర్శిస్తారు. ఆలేరు మండలం శరాజీపేటలో,  మోత్కూరు మండలం పొడిచేడులో, రామన్నపేట మండలం సిరిపురంలో, మండల కేంద్రమైన క‌ట్టంగూరులో, భీమారంలో ప‌ర్య‌టించే ఆమె మొత్తం ఐదు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు. కాగా, వైఎస్ […]

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన రెండో విడత పరామర్శ యాత్రలో రెండోరోజు నల్గొండ జిల్లాలో కొనసాగనుంది. ఈ రోజు ష‌ర్మిల ఐదు కుటుంబాలను ప‌రామ‌ర్శిస్తారు. ఆలేరు మండలం శరాజీపేటలో, మోత్కూరు మండలం పొడిచేడులో, రామన్నపేట మండలం సిరిపురంలో, మండల కేంద్రమైన క‌ట్టంగూరులో, భీమారంలో ప‌ర్య‌టించే ఆమె మొత్తం ఐదు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు. కాగా, వైఎస్ షర్మిల ప‌ర్య‌ట‌న‌ శుక్రవారం వరకు కొన‌సాగుతుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో న‌ల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోని 18 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు.
First Published:  9 Jun 2015 6:51 PM IST
Next Story