ప్రయాణికులకు రైల్వే బంపర్ ఆఫర్!
ప్రయాణికులకు భారతీయ రైల్వేశాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎవరైనా ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకున్న టికెట్ కన్‌ఫం కాకపోతే ఇక నుంచి బెంగ పడాల్సిన పని లేదు. ప్రయాణం ఎలా చేయాలిరా దేవుడా అంటూ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీ ప్రయాణానికి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు రైల్వే శాఖే చేసేస్తుంది. ఎలాగంటారా?… మీరు రిజర్వేషన్ చేసుకున్న టికెట్ కన్‌ఫం కాకపోతే… కన్‌ఫం అవడానికి అవకాశం లేదని రైల్వే శాఖ భావిస్తే… కనీసం మూడు రోజుల వ్యవధి ఉంటే… అపుడు […]
BY sarvi10 Jun 2015 9:46 AM IST
X
sarvi Updated On: 11 Jun 2015 5:07 AM IST
ప్రయాణికులకు భారతీయ రైల్వేశాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎవరైనా ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకున్న టికెట్ కన్‌ఫం కాకపోతే ఇక నుంచి బెంగ పడాల్సిన పని లేదు. ప్రయాణం ఎలా చేయాలిరా దేవుడా అంటూ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీ ప్రయాణానికి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు రైల్వే శాఖే చేసేస్తుంది. ఎలాగంటారా?… మీరు రిజర్వేషన్ చేసుకున్న టికెట్ కన్‌ఫం కాకపోతే… కన్‌ఫం అవడానికి అవకాశం లేదని రైల్వే శాఖ భావిస్తే… కనీసం మూడు రోజుల వ్యవధి ఉంటే… అపుడు మీరు హాయిగా రైలుకు బదులు విమానంలో ప్రయాణం చేయవచ్చు. ఇందుకు సంబంధించి భారతీయ రైల్వే స్పైస్ జెట్‌తో సహా పలు విమాన యాన సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఇప్పటికే కొన్ని సంస్థలతో అంగీకారం కుదిరింది. అయితే ఒకే ఒక్క అంశం ఏమిటంటే రైలు టిక్కెట్ కన్నా కొన్ని సందర్భాల్లో విమానం టికెట్ కొంత ఎక్కువ ఉండవచ్చు. అయినా విమానం టికెట్‌లో 30 నుంచి 40 శాతం వరకు రాయితీ లభించేట్టుగా రైల్వే శాఖ ఆయా విమానయాన సంస్థలతో మాట్లాడుతోంది. సాధారణంగా విమానాల్లో 20 నుంచి 30 శాతం వరకు సీట్లు ఎప్పుడూ ఖాళీగా ఉంటున్నట్టు గమనించిన రైల్వే ఉభయ తారకంగా ఈ పథకం లబ్ధి చేకూరుస్తుందని భావించి దీన్ని పట్టాల మీదకెక్కిస్తోంది. విమానంలో టికెట్ బుక్ చేయడానికి ముందుగా మీ అనుమతి తీసుకునే విధంగా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు. నిజంగా ఇది బంపర్ ఆఫరేగా మరి!
Next Story