పట్టపగలే రూ.17 లక్షల దారిదోపిడీ
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ నగరంలో దారి దోపిడీ ఘటన సంచలనం రేకెత్తించింది. బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని పట్టపగలే ముగ్గురు దుండగులు అటకాయించి అతని వద్ద నుంచి రూ.17 లక్షల నగదును దోచుకెళ్లారు. సునీల్ నల్వానీ అనే వ్యక్తి బ్యాంకుకు వెళ్ళి రూ.17 లక్షలు డ్రా చేసి ఆఫీస్‌కు తీసుకువెళ్తున్నారు. ఇదే సమయంలో మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు సునీల్‌ను ఒక వీధి చివర నిలువరించి అతడిని బండిపై నుంచి […]
BY sarvi9 Jun 2015 6:47 PM IST
X
sarvi Updated On: 10 Jun 2015 8:46 AM IST
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ నగరంలో దారి దోపిడీ ఘటన సంచలనం రేకెత్తించింది. బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని పట్టపగలే ముగ్గురు దుండగులు అటకాయించి అతని వద్ద నుంచి రూ.17 లక్షల నగదును దోచుకెళ్లారు. సునీల్ నల్వానీ అనే వ్యక్తి బ్యాంకుకు వెళ్ళి రూ.17 లక్షలు డ్రా చేసి ఆఫీస్‌కు తీసుకువెళ్తున్నారు. ఇదే సమయంలో మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు సునీల్‌ను ఒక వీధి చివర నిలువరించి అతడిని బండిపై నుంచి కిందకు తోసివేశారు. సునీల్‌ను చితకబాది కత్తితో బెదిరించి రూ.17 లక్షలు ఉన్న బ్యాగును తీసుకుని పరారయ్యారు. వారి దాడిలో సునీల్ ఎడమచేతికి గాయాలయ్యాయి. నిజానికి సునీల్‌తో పాటు మరో ఉద్యోగి కూడా బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. అతడు ముందు వెళ్లిపోగా వెనుక వెళ్తున్న సునీల్‌ను ఆపి దుండగులు డబ్బులు దోచుకున్నారు. దాన్ని బట్టి సునీల్ కదలికలు ముందు నుంచే తెలుసని పోలీసులు భావిస్తున్నారు.
Next Story