జర నవ్వండి ప్లీజ్ 109
ఒక కవి సుప్రసిద్ధ కవి శ్రీశ్రీ దగ్గరికొచ్చి “నా కవితల్లో వెలుగు, కాంతి రావాలంటే ఏం చెయ్యాలి?” అని అడిగాడు. శ్రీశ్రీ “వాటిని కాల్చెయ్యడమే” అని చెప్పాడు. ———————————————————————————— బంటాసింగ్: సంతా! ఒక స్త్రీ మన దేశానికి ప్రెసిడెంట్ అయితే ఆమెని ఏమని పిలుస్తారు? సంతాసింగ్ : రాష్ట్రపతి రంతాసింగ్: కాదు. ఆమెను “రాష్ట్రపత్ని” అంటారు. ———————————————————————————— ధూమపాన తీవ్ర వ్యతిరకే కార్యకర్త పక్కన సిగరేట్ తాగుతున్న అతన్ని “నీ సిగరెట్ పొగలో సగానికి సగం నేను పీల్చాను తెలుసా?” […]
ఒక కవి సుప్రసిద్ధ కవి శ్రీశ్రీ దగ్గరికొచ్చి “నా కవితల్లో వెలుగు, కాంతి రావాలంటే ఏం చెయ్యాలి?” అని అడిగాడు.
శ్రీశ్రీ “వాటిని కాల్చెయ్యడమే” అని చెప్పాడు.
————————————————————————————
బంటాసింగ్: సంతా! ఒక స్త్రీ మన దేశానికి ప్రెసిడెంట్ అయితే ఆమెని ఏమని పిలుస్తారు?
సంతాసింగ్ : రాష్ట్రపతి
రంతాసింగ్: కాదు. ఆమెను “రాష్ట్రపత్ని” అంటారు.
————————————————————————————
ధూమపాన తీవ్ర వ్యతిరకే కార్యకర్త పక్కన సిగరేట్ తాగుతున్న అతన్ని “నీ సిగరెట్ పొగలో సగానికి సగం నేను పీల్చాను తెలుసా?” అన్నాడు దగ్గుతూ.
సిగరేట్ తాగే అతను “నా సిగరెట్ ఖరీదు 3 రూపాయలు. అంటే మీరు నాకు రూపాయి యాభై పైసలు ఇవ్వాలన్నమాట” అన్నాడు.
————————————————————————————
భార్య ప్రతిరోజూ భర్తతో పోట్లాడుతూ ఉండేది. ఎందుకంటే భర్త ఎప్పుడూ పేకాట ఆడుతూ డబ్బులు తగలేస్తూ ఉండేవాడు.
సాయంత్రం ఆఫీసు నించి వచ్చి స్నానం చేసి పేకాటకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. భార్య నిలదీసింది.
భర్త సర్దిచెప్పే ప్రయత్నం చేస్తూ “చూడు! జూదమన్నది ఈ నాటిది కాదు. అది మహాభారతం నాటి నించి వుంది. అది తప్పని ఎవరూ అనలేరు” అన్నాడు.
ఆ మాటలకు భార్య “నువ్వు మహాభారతంలో హీరోలని ఫాలో ఐతే నేను మహాభారతంలోని హీరోయిన్లని ఫాలో అవుతాను. ద్రౌపదికి ఐదుమంది భర్తలు” అంది.