Telugu Global
Cinema & Entertainment

పూరీకి చేసింది చాలా తక్కువే అంటున్న చార్మీ

‘జ్యోతిలక్ష్మి’ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో చార్మీ యాంకరింగ్ కాస్త అతిగా ఉందని ఒక టాక్ వచ్చింది ఇండస్ట్రీలో…సాధారణ సినీగోయర్స్‌లో కూడా. ఒక స్టార్ హీరో రేంజ్‌లో అభిమాన సంఘాలతో పూల దండలు వేయించడం, సన్మానం చేయించడం మొదలుకుని, అతిగా పొగడడం చూసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించిందనే కథనాలు చాలా వచ్చాయి. అయినా చార్మీ ఏం తగ్గట్లేదు. ప్రముఖ టీ.వీ.చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చార్మీ మళ్ళీ పూరీ గానం చేసింది. అసలు తాను చేసింది చాలా తక్కువని, […]

పూరీకి చేసింది చాలా తక్కువే అంటున్న చార్మీ
X

‘జ్యోతిలక్ష్మి’ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో చార్మీ యాంకరింగ్ కాస్త అతిగా ఉందని ఒక టాక్ వచ్చింది ఇండస్ట్రీలో…సాధారణ సినీగోయర్స్‌లో కూడా. ఒక స్టార్ హీరో రేంజ్‌లో అభిమాన సంఘాలతో పూల దండలు వేయించడం, సన్మానం చేయించడం మొదలుకుని, అతిగా పొగడడం చూసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించిందనే కథనాలు చాలా వచ్చాయి. అయినా చార్మీ ఏం తగ్గట్లేదు.

ప్రముఖ టీ.వీ.చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చార్మీ మళ్ళీ పూరీ గానం చేసింది. అసలు తాను చేసింది చాలా తక్కువని, ఆ సన్మానం ఆ పొగడ్తల గురించి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారని అభిప్రాయపడింది. తాను ‘జ్యోతిలక్ష్మి’ని నిర్మించడానికి కావాల్సిన మోటివేషన్ పూరీ వలననే లభించిందని, ఆ పొగడ్తలకు పూరీ అర్హుడని అందరూ ఫీల్ అయ్యారని ఎంతో పొంగిపోతూ చెప్పింది. కాని…సినిమా నిర్మాతను ఆ మాత్రం మోటివేట్ చెయ్యకపోతే డబ్బులు ఎలా పెడతారని, అందుకే పూరీ చార్మీని పొగిడి బుట్టలో వేసి ఉంటాడని ఇన్‌సైడ్ టాక్. అఫ్‌కోర్స్, ఇది సినిమా ఇండస్ట్రీలో అత్యంత సహజమైన విషయమే.

First Published:  10 Jun 2015 4:08 AM
Next Story