కేసీఆర్‌కు నన్నుఅరెస్ట్ చేసే దమ్ముందా: చంద్రబాబు
తనను అరెస్ట్ చేస్తే అదే కేసీఆర్ ప్రభుత్వానికి చివరి రోజు అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై తెలంగాణ సర్కారు అతిగా వ్యవహరిస్తోందని, ఉమ్మడి రాజధానిలో తన ఫోన్ ట్యాప్ చేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో చంద్రబాబు మాట్లాడుతూ నన్ను అరెస్ట్ చేసేందుకు కేసీఆర్ ఎవరు అని అంటూనే అసలు నన్ను అరెస్ట్ చేసే అధికారం కేసీఆర్‌కు ఉందా అని […]
BY sarvi10 Jun 2015 9:51 AM IST
X
sarvi Updated On: 11 Jun 2015 5:08 AM IST
తనను అరెస్ట్ చేస్తే అదే కేసీఆర్ ప్రభుత్వానికి చివరి రోజు అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై తెలంగాణ సర్కారు అతిగా వ్యవహరిస్తోందని, ఉమ్మడి రాజధానిలో తన ఫోన్ ట్యాప్ చేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో చంద్రబాబు మాట్లాడుతూ నన్ను అరెస్ట్ చేసేందుకు కేసీఆర్ ఎవరు అని అంటూనే అసలు నన్ను అరెస్ట్ చేసే అధికారం కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ముందు చెప్పారని, ఇపుడు మాట మారుస్తున్నారని ఆయన అంటూ తన మాటలని చెబుతున్న ఆడియో టేపులను తన సొంత ఛానల్‌లో ప్రసారం చేయించుకున్నారని ఆయన తెలిపారు. ఆడియో టేపుల బూచిని చూపించి తనను బ్లాక్ మెయిల్ చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తూ… అసలు మొదట ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని డిమాండు చేశారు. కేసీఆర్‌కు ఉన్న పరిమితులు ఏమిటో తెలుసుకుంటే మంచిదని ఆయన అన్నారు. ఉమ్మడి రాజధానిలో రెండు రాష్ట్రాలకు సమాన హక్కులుంటాయని, కాని హైదరాబాద్‌లో అలా జరగడం లేదని చెబుతూ సెక్షన్ 8ని తక్షణమే పకడ్బందీగా అమలు చేయాలని డిమాండు చేశారు. మా స్వేచ్ఛ, భద్రత చూసుకోవలసిన బాధ్యత గవర్నర్‌దని, కాని ఉమ్మడి రాజధానిలో అలా జరగడం లేదని ఆయన ఆరోపించారు. ఈ విషయాలన్నీ తెలియజేయడానికే తాను ఢిల్లీ వచ్చానని, ప్రధానమంత్రి నరేంద్రమోడిని, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని, తెలంగాణ ప్రభుత్వ అన్యాయ పోకడలను వివరిస్తానని చంద్రబాబు తెలిపారు.
Next Story