Telugu Global
Cinema & Entertainment

బాహుబలి వేదిక ఖరారైంది

ఎన్నో తర్జనభర్జనల తర్వాత బాహుబలి ఆడియోను ఎక్కడ విడుదల చేయాలనే అంశంపై ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కోసం తెలంగాణను వీడి ఆంధ్రాకు పయనమైంది బాహుబలి టీం. ఆనవాయితీ ప్రకారం హైదరాబాద్ లో ఆడియోను విడుదల చేయకుండా.. తిరుపతిని ఖరారుచేసింది సినిమా యూనిట్. ఈనెల 13న తిరుపతిలో బాహుబలి పాటల్ని ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యువ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ వేడుకను నిర్వహించే అవకాశం […]

బాహుబలి వేదిక ఖరారైంది
X
ఎన్నో తర్జనభర్జనల తర్వాత బాహుబలి ఆడియోను ఎక్కడ విడుదల చేయాలనే అంశంపై ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కోసం తెలంగాణను వీడి ఆంధ్రాకు పయనమైంది బాహుబలి టీం. ఆనవాయితీ ప్రకారం హైదరాబాద్ లో ఆడియోను విడుదల చేయకుండా.. తిరుపతిని ఖరారుచేసింది సినిమా యూనిట్. ఈనెల 13న తిరుపతిలో బాహుబలి పాటల్ని ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యువ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ వేడుకను నిర్వహించే అవకాశం దక్కించుకుంది. సో.. ఈ శనివారం సినీఅభిమానుల దృష్టంతా తిరుపతిపై పడనుంది. ఈ ఆడియో వేడుకకు టోటల్ సినిమా యూనిట్ అంతా హాజరుకాబోతోంది. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు ప్రభాస్, రానా, అనుష్క, తమన్న, రమ్యకృష్ణ, నాజర్ ఈ ఆడియో ఫంక్షన్ కు హాజరవుతారు. వీళ్లతో పాటు ప్రత్యేక అతిథులుగా కొందరు హీరోల్ని ఫంక్షన్ కు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు రాజమౌళి.
First Published:  10 Jun 2015 4:45 AM IST
Next Story