టీఆర్‌ఎస్ ప్రశ్నలకు జవాబు చెప్పని చంద్రబాబు
గురువింద గింజ కింద నలుపెరుగదన్నట్టు చంద్రబాబు వ్యవహారం ఉందని టీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. సంకల్ప దీక్ష సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ సహనం కోల్పోయాడని, పిచ్చివాడిలా మహా ఆవేశపడ్డాడని అతని ఆవేశం చూస్తుంటే దొరికిపోయిన దొంగలాగా ఉక్రోషంగా ఉన్నాడని టీఆర్‌ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. రేవంత్‌రెడ్డి దొరికి ఇన్నిరోజులైనా దాని మీద చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు? రేవంత్‌రెడ్డిని నువ్వే మధ్యవర్తిగా పంపిఉండకపోతే లంచం ఇచ్చి దొరికిపోయిన వ్యక్తిని ఎందుకు పార్టీనుంచి సస్పెండ్ చేయలేదు? కనీసం రేవంత్‌రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు […]
గురువింద గింజ కింద నలుపెరుగదన్నట్టు చంద్రబాబు వ్యవహారం ఉందని టీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. సంకల్ప దీక్ష సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ సహనం కోల్పోయాడని, పిచ్చివాడిలా మహా ఆవేశపడ్డాడని అతని ఆవేశం చూస్తుంటే దొరికిపోయిన దొంగలాగా ఉక్రోషంగా ఉన్నాడని టీఆర్‌ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు.
- రేవంత్‌రెడ్డి దొరికి ఇన్నిరోజులైనా దాని మీద చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు?
- రేవంత్‌రెడ్డిని నువ్వే మధ్యవర్తిగా పంపిఉండకపోతే లంచం ఇచ్చి దొరికిపోయిన వ్యక్తిని ఎందుకు పార్టీనుంచి సస్పెండ్ చేయలేదు?
- కనీసం రేవంత్‌రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు నోరు విప్పలేదు ఎందుకు?
- సోషల్ మీడియాలో ప్రతిరోజు దర్శనమిచ్చే అబ్బాయి లోకేష్‌బాబు దీనిమీద ఎందుకు స్పందించరు?
- రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ లో పార్టీ నిర్ణయమేమిటో ఎందుకు చెప్పరు?
- చంద్రబాబు ఫోన్‌ని ట్యాప్ చేసారని పదేపదే అరిచి గీపెడుతున్న చంద్రబాబు కాని టీడీపీ నేతలు గాని పరకాల ప్రభాకర్‌గాని అసలు ఇంతకూ చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడాడా లేదా? అనే విషయం తేల్చరెందుకు?
- మాట్లాడిన విషయం నిజం కాకపోతే మాట్లాడలేదని ప్రకటించవచ్చు. పరువు నష్టం దావా వేయవచ్చు. కోర్టులో కేసు వేయవచ్చు. ఇవ్వన్నీ వదిలేసి సీఎం ఫోన్‌నే ట్యాప్ చేస్తారా? అని అరిచి గీపెట్టడమెందుకు.
- సీఎం ఫోన్‌ని ట్యాప్ చేయలేదు. స్టీఫెన్‌సన్ ఫోన్ మీద నిఘా పెట్టే హక్కు మాకు ఉంది. నిఘా పెట్టాము అక్కడ చంద్రబాబు దొరికి పోయాడు అని తెలంగాణా పోలీసులు చెబుతున్నా నా ఫోన్‌ని ట్యాప్ చేస్తారా అని చిందులు తొక్కడం ఎందుకు?
- తెలంగాణ ప్రభుత్వం ఏమైనా తప్పు చేసుంటే రాజ్యాంగ బద్ధంగా, చట్టప్రకారం వాళ్ళమీద కేసులు వేయవచ్చు. అంతేకాని నా ఫోన్ ట్యాప్ చేసారు కాబట్టి ప్రజలారా మీరు తిరగబడండి అంటూ ప్రజలను రెచ్చగొడుతూ తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు పెంచడం దేనికి?
- నాకు ఏసీబీ ఉంది, నాకు పోలీసులు ఉన్నారు అంటూ ఆవేశపడేకన్నా చట్ట ప్రకారం వ్యవహరించవచ్చు కదా!
- టేపులు నిజమైనవి కావు అంటున్నారు. అదే నిజమైతే ఫిర్యాదు చేయవచ్చు. అంతేగాని నేను మహా నిజాయితీ పరుణ్ణి, నిప్పులాంటి వాణ్ని, అనుభవజ్ఞుణ్ణి, హైదరాబాద్‌ను నేనే నిర్మించాను అంటూ ప్రేలాపనలేందుకు? మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి చాలు అంటూ తెరాసా నాయకులు, కేసీఆర్, తెలంగాణావాదులు వేస్తున్న ప్రశ్నలకు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే.