మూడోరోజు రేవంత్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం
నోటుకు ఓటు స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై ఏసీబీ అధికారులు మూడోరోజూ ప్రశ్నల వర్షం కురిపించారు. ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రశ్నావళి ఆధారంగా దాదాపు 80,90 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. రేవంత్ నాలుగు రోజుల ఏసీబీ కస్టడీ ముగియనుండడంతో కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించినట్లు సమాచారం.మూడో రోజైన సోమవారం కస్టడీలోకి తీసుకునే ముందు రేవంత్‌తోపాటు ఇతర నిందితులకు ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.రేవంత్‌కు కొంత […]
BY Pragnadhar Reddy9 Jun 2015 2:53 AM IST
X
Pragnadhar Reddy Updated On: 9 Jun 2015 2:53 AM IST
నోటుకు ఓటు స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై ఏసీబీ అధికారులు మూడోరోజూ ప్రశ్నల వర్షం కురిపించారు. ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రశ్నావళి ఆధారంగా దాదాపు 80,90 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. రేవంత్ నాలుగు రోజుల ఏసీబీ కస్టడీ ముగియనుండడంతో కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించినట్లు సమాచారం.మూడో రోజైన సోమవారం కస్టడీలోకి తీసుకునే ముందు రేవంత్‌తోపాటు ఇతర నిందితులకు ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.రేవంత్‌కు కొంత హైబీపీ(150/90) ఉన్నందున అవసరమైన మందులను వైద్యులిచ్చారు. అనంతరం రేవంత్‌ను బంజారాహిల్స్‌లోని ఏసీబీ హెడ్‌క్వార్టర్‌కు తరలించిన అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రశ్నావళి ప్రకారం 80 నుంచి 90 ప్రశ్నలు అడిగి సమాధానాలు సేకరించారు. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహను వేర్వేరుగా విచారిస్తున్న అధికారులు.. సెబాస్టియన్, ఉదయ్‌సింహ ఇచ్చిన సమాచారం ఆధారంగా రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ప్రశ్నించారు. ముందస్తుగా చెల్లించేందుకు తెచ్చిన రూ. 50 లక్షలు, మిగతా రూ. 4.5 కోట్లు ఎవరు సమకూర్చారు? ఈ కుట్రలో ఇంకెవరెవరు ఉన్నారు? అనే అంశాలపైనే ప్రధానంగా ప్రశ్నల్లో దృష్టి సారించారని తెలుస్తోంది. రేవంత్ సహనిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రెండో రోజు, మూడో రోజు కలిపి రేవంత్ నుంచి మొత్తం 150 ప్రశ్నలకు సమాధానం రాబట్టారు. ఇక కస్టడీ ముగియనున్న చివరి రోజు(మంగళవారం) కేసు దర్యాప్తు ‘ముగింపునకు’ అవసరమైన ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఇందుకోసం మైండ్ గేమ్ విధానాన్ని ప్రధానంగా అనుసరించనున్నట్లు తెలుస్తోంది.
Next Story