Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 108

ఇద్దరమ్మాయిలు చెరొక రాఖీ పట్టుకుని వెళుతున్నారు. ఇద్దరబ్బాయిలు వాళ్ళని అనుసరించారు. ఎంతదూరం నడిచినా ఆ అబ్బాయిలు ఆ అమ్మాయిల్ని వదలిపెట్టకుండా అనుసరించారు. చివరికి విసిగిపోయిన అమ్మాయిలు ఆ అబ్బాయిలిద్దరికీ రాఖీలు కట్టి వాళ్ళని అన్నయ్యలు చేశారు. ఐనా అబ్బాయిలు ఏమాత్రం దిగులుపడలేదు. మొదటి అబ్బాయి రెండో అబ్బాయితో “నువ్వు మా చెల్లెల్ని పెళ్ళి చేసుకో, నేను మీ చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటాను” అన్నాడు. ———————————————————— ఒక ప్రభుత్వోద్యోగి డాక్టర్‌ దగ్గరకు వెళ్ళి “డాక్టర్‌ గారూ! నేను చాలా […]

ఇద్దరమ్మాయిలు చెరొక రాఖీ పట్టుకుని వెళుతున్నారు. ఇద్దరబ్బాయిలు వాళ్ళని అనుసరించారు. ఎంతదూరం నడిచినా ఆ అబ్బాయిలు ఆ అమ్మాయిల్ని వదలిపెట్టకుండా అనుసరించారు. చివరికి విసిగిపోయిన అమ్మాయిలు ఆ అబ్బాయిలిద్దరికీ రాఖీలు కట్టి వాళ్ళని అన్నయ్యలు చేశారు. ఐనా అబ్బాయిలు ఏమాత్రం దిగులుపడలేదు. మొదటి అబ్బాయి రెండో అబ్బాయితో “నువ్వు మా చెల్లెల్ని పెళ్ళి చేసుకో, నేను మీ చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటాను” అన్నాడు.
————————————————————
ఒక ప్రభుత్వోద్యోగి డాక్టర్‌ దగ్గరకు వెళ్ళి “డాక్టర్‌ గారూ! నేను చాలా అలసిపోతున్నాను, ఏం చెయ్యమంటారు?” అన్నాడు. డాక్టర్‌ పరీక్షలు చేసి “నీకు విశ్రాంతి చాలా అవసరం. వీలైనంత తొందరగా పొద్దున ఇంటినించి బయల్దేరి ఆఫీసుకు వెళ్ళు” అన్నాడు.
————————————————————
ఒక కూరగాయలమ్మే అతనికి కొడుకు పుట్టాడు. ఆ సంగతి తెలిసిన స్నేహితుడు
“నీ కొడుకెలా ఉన్నాడయ్యా’ అని అడిగాడు.
చాలా “తాజాగా ఉన్నాడు సార్‌ ” అన్నాడు కూరగాయలతను.

First Published:  8 Jun 2015 6:33 PM IST
Next Story