Telugu Global
Others

9వ తేదీ రాత్రి వ‌ర‌కు చేప ప్రసాదం పంపిణీ 

ప్రతి సంవత్సరం మృగశిరకార్తె నాడు బత్తిని సోదరులు ఆస్తమా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న‌ చేప మందు ప్రసాదానికి హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో సోమ‌వారం రాత్రి 11 గంట‌ల నుంచే జ‌నం బారులు తీరారు. నాలుగైదు రోజుల ముందు నుంచే హైదరాబాద్ జిల్లా కలెక్టర్, పోలీస్ శాఖ, జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, వాటర్‌బోర్డ్, ఇతర శాఖల అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో దీనికి సంబంధించిఅన్ని ఏర్పాట్లు పూర్తి చేయ‌డంతో చేప మందు పంపిణీ కార్య‌క్ర‌మం స‌జావుగా సాగుతోంది. వివిధ […]

9వ తేదీ రాత్రి వ‌ర‌కు చేప ప్రసాదం పంపిణీ 
X
ప్రతి సంవత్సరం మృగశిరకార్తె నాడు బత్తిని సోదరులు ఆస్తమా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న‌ చేప మందు ప్రసాదానికి హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో సోమ‌వారం రాత్రి 11 గంట‌ల నుంచే జ‌నం బారులు తీరారు. నాలుగైదు రోజుల ముందు నుంచే హైదరాబాద్ జిల్లా కలెక్టర్, పోలీస్ శాఖ, జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, వాటర్‌బోర్డ్, ఇతర శాఖల అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో దీనికి సంబంధించిఅన్ని ఏర్పాట్లు పూర్తి చేయ‌డంతో చేప మందు పంపిణీ కార్య‌క్ర‌మం స‌జావుగా సాగుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆస్తమా రోగులు రెండురోజుల ముందుగానే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలివచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు, వారి సహాయకులు చేప ప్రసాదం కోసం క్యూల‌లో బారులుతీరి నిలుచున్నారు. కాగా చేప ప్రసాదం కోసం తరలివచ్చిన రోగులు, వారి సహాయకులకు పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా అల్పాహారాన్ని అందిస్తున్నాయి. ఈ ప్రసాదం పంపిణీకి సంబంధించి దాదాపు 50 వేల చేపలు ముందుగా అందుబాటులో ఉంచారు. అవి అయిపోయే సమయంలో మ‌ళ్ళీ తెప్పిస్తామని పేర్కొన్నారు. అలాగే, చేప ప్రసాద పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సెంట్రల్ జోన్‌తోపాటు నగరంలోని పలు జోన్‌లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులను ఇక్కడ బందోబస్తు విధులను కేటాయించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ నలుమూలలా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. రోగులకు సహకరించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. 9వ తేదీ రాత్రి వరకు ఈ చేప ప్ర‌సాదం పంపిణీ కొనసాగుతోంది.
First Published:  8 Jun 2015 6:30 PM IST
Next Story