Telugu Global
Cinema & Entertainment

చెర్రీ ఫైట్ మాస్టరే కాకుండా పోలీస్ ఆఫీసర్ కూడానా ?

 శ్రీనువైట్ల-రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈమధ్యే యూరోప్ షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో మరికొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మూవీలో చరణ్ ఓ స్టంట్ మాస్టర్ లా కనిపించబోతున్నాడనే ప్రచారం ఎప్పట్నుంచో సాగుతోంది. మరోవైపు ఓ క్రీడాకారుడిగా కూడా కనిపిస్తాడనే రూమర్ ఉంది. ఈ రెండు పుకార్లు నడుస్తుండగానే హఠాత్తుగా పోలీస్ గెటప్ లో ప్రత్యక్షమయ్యాడు చెర్రీ. అవును.. హైదరాబాద్ […]

చెర్రీ ఫైట్ మాస్టరే కాకుండా పోలీస్ ఆఫీసర్ కూడానా ?
X

శ్రీనువైట్ల-రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈమధ్యే యూరోప్ షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో మరికొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మూవీలో చరణ్ ఓ స్టంట్ మాస్టర్ లా కనిపించబోతున్నాడనే ప్రచారం ఎప్పట్నుంచో సాగుతోంది. మరోవైపు ఓ క్రీడాకారుడిగా కూడా కనిపిస్తాడనే రూమర్ ఉంది. ఈ రెండు పుకార్లు నడుస్తుండగానే హఠాత్తుగా పోలీస్ గెటప్ లో ప్రత్యక్షమయ్యాడు చెర్రీ. అవును.. హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో చెర్రీ పోలీస్ గెటప్ లోనే కనిపించాడు. దీంతో వైట్ల సినిమాలో చరణ్ పోలీస్ గా కనిపించబోతున్నాడంటూ మరో ప్రచారం ఊపందుకుంది. అయితే శ్రీనువైట్ల సినిమాల్లో హీరో రకరకాల గెటప్పుల్లో కనిపిస్తాడు. క్యారెక్టర్ ఇదేనంటూ కచ్చితంగా చెప్పడానికి వీల్లేదు. గతంలో దూకుడు, బాద్ షా విషయాల్లో కూడా ఇదే జరిగింది. కాబట్టి.. అధికారికంగా ప్రకటించే వరకు రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటనేది సస్పెన్సే.

First Published:  8 Jun 2015 2:02 AM
Next Story