ఆ సంభాషణ చంద్రబాబుది కాదు: పరకాల
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ముడుపుల వ్యవహారంలో తాజాగా బహిర్గతమైన ఆడియో టేపుల్లోని సంభాషణ తమ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుది కాదని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. అసలు ఈ ఆడియో ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అక్కడక్కడ మాట్లాడిన మాటలన్నీ కలిపి టెక్నాలజీ సాయంతో ప్రజలను నమ్మించేందుకే సృష్టించారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ నేరం అని, కావాలనే ట్యాప్ చేశారేమో చెప్పాలని పరకాల డిమాండ్ చేశారు. ప్రభాకర్ మీడియాతో […]
BY Pragnadhar Reddy7 Jun 2015 6:47 PM IST
X
Pragnadhar Reddy Updated On: 7 Jun 2015 6:47 PM IST
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ముడుపుల వ్యవహారంలో తాజాగా బహిర్గతమైన ఆడియో టేపుల్లోని సంభాషణ తమ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుది కాదని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. అసలు ఈ ఆడియో ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అక్కడక్కడ మాట్లాడిన మాటలన్నీ కలిపి టెక్నాలజీ సాయంతో ప్రజలను నమ్మించేందుకే సృష్టించారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ నేరం అని, కావాలనే ట్యాప్ చేశారేమో చెప్పాలని పరకాల డిమాండ్ చేశారు. ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ సోమవారం తాము నిర్వహించే మహాసంకల్ప దీక్షను భగ్నం చేయాలనే దురుద్దేశంతో కేసీఆర్ ఈ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఈ సంకల్పదీక్ష ప్రజలు దిగ్విజయం చేయాలని, తాము కూడా ఈ సభను రెట్టింపు ఉత్సాహంతో నిర్వహిస్తామని అన్నారు. మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందని, తెలంగాణ హోంమంత్రి టేపులున్నాయని ముందే చెప్పారని, దీనిలో భాగంగానే ఈ కుట్రకు స్థానం కల్పించారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సన్నిహితుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారా? ఇదంతా తమపై కుట్ర కాదా? మహాసంకల్ప దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఓ పథకం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బ తీస్తున్నారని ఈ టేపులు ఎలా తీసుకొచ్చారో చెప్పాలని, ఏపీ సీఎం ఫోన్ ను ట్యాప్ చేశామని చెప్పగలరా? అని నిలదీశారు. దీనిపై అన్నిరకాలుగా ఫైట్ చేస్తామని, ఇది చాలా నీచమైన పని.. కుట్రపూరితమైన పని అని ఆయన విమర్శించారు. ఇది బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పనికాదని, ఓటుకు నోటు కేసులో అన్నీ టేపులు కోర్టుకు సమర్పించామన్నప్పుడు మరి ఈ టేపులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు.
Next Story