ఇక నాలుగు రోజులే పెళ్లిళ్ల సందడి
పెళ్ళిళ్ళ సందడి ఇక నాలుగు రోజులే. ఈ నెల 12న శుక్రవారం జైష్ఠ బహుళ ఏకాదశితో పెళ్లిళ్ల సందడికి తెర పడుతుందని పురోహితులు వంగర రామకృష్ణశాస్త్రి తెలిపారు. పెళ్లిళ్లతోపాటు గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలకు నాలుగున్నర నెలలు విరామం ఉంటుంది. సాధారణంగా పెళ్లిళ్లకు ఏటా మూడు నెలలపాటు బ్రేక్ వస్తుంది. అయితే ఈ ఏడాది రెండు ఆషాడ మాసాలు, శ్రావణ మాసం మూఢమి, భాద్రపద శూన్యమాసం కారణంగా నాలుగు నెలల విరామం వచ్చింది. తిరిగి అక్టోబర్ 15 గురువారం […]
BY sarvi7 Jun 2015 1:26 PM GMT
X
sarvi Updated On: 8 Jun 2015 6:47 AM GMT
పెళ్ళిళ్ళ సందడి ఇక నాలుగు రోజులే. ఈ నెల 12న శుక్రవారం జైష్ఠ బహుళ ఏకాదశితో పెళ్లిళ్ల సందడికి తెర పడుతుందని పురోహితులు వంగర రామకృష్ణశాస్త్రి తెలిపారు. పెళ్లిళ్లతోపాటు గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలకు నాలుగున్నర నెలలు విరామం ఉంటుంది. సాధారణంగా పెళ్లిళ్లకు ఏటా మూడు నెలలపాటు బ్రేక్ వస్తుంది. అయితే ఈ ఏడాది రెండు ఆషాడ మాసాలు, శ్రావణ మాసం మూఢమి, భాద్రపద శూన్యమాసం కారణంగా నాలుగు నెలల విరామం వచ్చింది. తిరిగి అక్టోబర్ 15 గురువారం ఆశ్వీజ శుద్ధ విదియ నుంచి పెళ్లిళ్లతోపాటు ఇతర శుభకార్యాలకు అవకాశం ఉంది. పెళ్లిళ్లకు బ్రేక్ వచ్చినా అన్నప్రాసనలు, శ్రీమంతం, శాంతులు, బారసాలలు వంటి కార్యక్రమాలు ఈ నాలుగు నెలలలో చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.
Next Story