లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా: కేటీఆర్
తనపై చేస్తున్న ఆరోపణలకు టీవీ ఎదుట లైడిటక్టర్ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్ధమా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడుస్తున్న సమస్య కాదని అయితే అలా సృష్టించే ప్రయత్నం చంద్రబాబు, ఆయన మనుషులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ అవినీతి చేష్టలు బట్టబయలు అయ్యాయని, దమ్ముంటే తన సవాల్ ను చంద్రబాబు స్వీకరించాలని ఆయన డిమాండు చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల […]
BY sarvi8 Jun 2015 8:03 AM IST
X
sarvi Updated On: 8 Jun 2015 8:05 AM IST
తనపై చేస్తున్న ఆరోపణలకు టీవీ ఎదుట లైడిటక్టర్ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్ధమా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడుస్తున్న సమస్య కాదని అయితే అలా సృష్టించే ప్రయత్నం చంద్రబాబు, ఆయన మనుషులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ అవినీతి చేష్టలు బట్టబయలు అయ్యాయని, దమ్ముంటే తన సవాల్ ను చంద్రబాబు స్వీకరించాలని ఆయన డిమాండు చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్టీఫెన్ సన్ తో చంద్రబాబు జరిపిన ఆడియో టేపులు బట్టబయలైన నేపథ్యంలో తనపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 3 కోట్ల రూపాయలు ఎర వేశానని, తన తరఫున ఎవరో మాట్లాడారని నిందలు వేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అలాంటి మాటలు మానుకోవాలని, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
Next Story