Telugu Global
Others

హైద‌రాబాద్ నీ అబ్బ జాగీరా: కేసీఆర్‌

హైద‌రాబాద్‌పై పెత్త‌నం చేయ‌డానికి ఇదేమ‌న్నా నీ అబ్బ జాగీరా అని  ప్ర‌శ్నించారు తెలంగాణ సీఎం కె. చంద్ర‌శేఖ‌ర‌రావు. న‌ల్గొండ జిల్లా దామ‌ర‌చ‌ర్ల మండ‌లం వీర్ల‌పాలెంలో విద్యుత్ ప్లాంట్ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. ప‌ట్ట‌ప‌గ‌లు దొరికిన దొంగ‌వ‌యి కూడా ఇంకా బొంకుతున్నావా అని నిల‌దీశారు. ఈ ప‌ద్ధ‌తి ఇలాగే కొన‌సాగితే ఒక్క నిమ‌షం కూడా హైద‌రాబాద్‌లో ఉండ‌లేవ‌ని, తెలంగాణ ప్ర‌జ‌లు త‌రిమిత‌రిమి కొడతార‌ని హెచ్చ‌రించారు. నిన్ను ఇరికిస్తే ఇరుక్కొడానికి నువేమ‌న్నా అమాయ‌కుడివా […]

హైద‌రాబాద్ నీ అబ్బ జాగీరా: కేసీఆర్‌
X
హైద‌రాబాద్‌పై పెత్త‌నం చేయ‌డానికి ఇదేమ‌న్నా నీ అబ్బ జాగీరా అని ప్ర‌శ్నించారు తెలంగాణ సీఎం కె. చంద్ర‌శేఖ‌ర‌రావు. న‌ల్గొండ జిల్లా దామ‌ర‌చ‌ర్ల మండ‌లం వీర్ల‌పాలెంలో విద్యుత్ ప్లాంట్ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. ప‌ట్ట‌ప‌గ‌లు దొరికిన దొంగ‌వ‌యి కూడా ఇంకా బొంకుతున్నావా అని నిల‌దీశారు. ఈ ప‌ద్ధ‌తి ఇలాగే కొన‌సాగితే ఒక్క నిమ‌షం కూడా హైద‌రాబాద్‌లో ఉండ‌లేవ‌ని, తెలంగాణ ప్ర‌జ‌లు త‌రిమిత‌రిమి కొడతార‌ని హెచ్చ‌రించారు. నిన్ను ఇరికిస్తే ఇరుక్కొడానికి నువేమ‌న్నా అమాయ‌కుడివా అని ప్ర‌శ్నించారు. నీ అరువుల‌తో పెడ‌బొబ్బ‌ల‌తో మాయ చేద్దామ‌నుకుంటున్నావా… ఖ‌బ‌డ్దార్ అంటూ కేసీఆర్ హెచ్చ‌రించారు. డ‌బ్బులిచ్చి ఎమ్మెల్యేల‌తో ల‌ఫంగి ప‌నులు చేయించేది నీవు… నీ ఏసీబీ ఉంటే మాకు భ‌య‌మేంటి అని ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్‌కి నీవు కాదు, తెలంగాణ బిడ్డ ముఖ్య‌మంత్రి మ‌ర్చిపోకు… ఖ‌బ‌డ్దార్ అంటూ హెచ్చ‌రించారు. ఎక్కువ మాట్లాడితే ఏం శాస్తి జ‌రుగుతుందో అది జ‌రుగుతుంది జ‌గ్ర‌త్త అంటూ నిప్పులు కక్కారు. నీ ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడు… నీ బ‌తుకే బ‌య‌ట ప‌డుతుంది… ఇంకా సిగ్గులేకుండా నోటికొచ్చిన‌ట్టు వాగుతావా జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రించారు. నీకు ఏసీబీ ఉంటే ఉండ‌నీ… నీ లెక్క నేను దొంగానా అని ప్ర‌శ్నించారు. ఈ గ‌డ్డ మీద నీ కిరికిరి చెల్ల‌ద‌ని అన్నారు. నీ అరుపుల‌కు, పెడ‌బొబ్బ‌ల‌కు భ‌య‌ప‌డిపోమ‌ని ఆయ‌న అన్నారు. కాంగ్రెస్ స‌న్నాసుల వ‌ల్లే ఈవేళ హైద‌రాబాద్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాయ‌కుల‌కు కూర్చోడానికి చోటు దొరికింది. ఉన్న‌న్నాళ్లూ మంచిగా ఉండి బుద్దిగా పో… లేకుంటే న‌ష్ట‌పోయేది నీవే… అంటూ కేసీఆర్ హెచ్చ‌రించారు.
First Published:  8 Jun 2015 3:43 PM IST
Next Story