Telugu Global
NEWS

కేసీఆర్‌‌పై ఫిర్యాదు... హెచ్చార్సీ ఆదేశం

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడు కృష్ణాయాదవ్‌ హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఫోన్‌ను ట్యాపింగ్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హెచ్చార్సీ ఈ నెల 18 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది. మ‌రోవైపు  కేసీఆర్‌ కుట్రలపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి కామినేని అన్నారు. కేంద్రంలో ఉన్నది తమ ప్రభుత్వమే అన్న ఆయన ఏపీ అభివృద్ధిని ఓర్వలేకే కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గ తీర్మానాలకు […]

కేసీఆర్‌‌పై ఫిర్యాదు... హెచ్చార్సీ ఆదేశం
X
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడు కృష్ణాయాదవ్‌ హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఫోన్‌ను ట్యాపింగ్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హెచ్చార్సీ ఈ నెల 18 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది. మ‌రోవైపు కేసీఆర్‌ కుట్రలపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి కామినేని అన్నారు. కేంద్రంలో ఉన్నది తమ ప్రభుత్వమే అన్న ఆయన ఏపీ అభివృద్ధిని ఓర్వలేకే కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గ తీర్మానాలకు బీజేపీ సహకారం ఉంటుందన్నారు. ఎన్నికల ముందు నుంచి మేం మిత్రపక్షంగా ఉన్నామని, భవిష్యత్‌లో కూడా మిత్రపక్షంగానే కొనసాగుతామని మంత్రి కామినేని తెలిపారు.
టేపులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సృష్టే: పెద్దిరెడ్డి
టేపులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సృష్టేనని టీడీపీ నేత పెద్దిరెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఘటన జరిగిన రోజే టేపులు ఎందుకు బయట పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. టేపులు ఎవరు రిలీజ్‌ చేసినా బహిర్గతం చేయాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన వైఫల్యాలను… కప్పిపుచ్చుకునేందుకే ఈ ఎత్తుగడలు వేస్తోందని ఆయన విమర్శించారు. ఇరురాష్ట్రాల మధ్య వైరం పెట్టడం సరికాదని పెద్దిరెడ్డి హితవు పలికారు.
ఐదు ఎమ్మెల్సీలు ఎలా గెలిచారో చెప్పాలి: మోత్కుపల్లి
టీఆర్‌ఎస్‌ వ్యవహారం దొంగే దొంగాదొంగ అన్నట్టుందని టీ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. బేరసారాలు లేకుండానే మా ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారా? తుమ్మల, తలసాని ఇంటికి వెళ్లి చర్చలు జరపలేదా?అని ప్రశ్నించారు. 63మంది ఎమ్మెల్యేలు 85 మంది ఎలా అయ్యారు, ఐదు ఎమ్మెల్సీలను ఎలా గెలిచారో టీఆర్ఎస్ చెప్పాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. కేసీఆర్‌ బెదిరింపులతోనే టీఆర్‌ఎస్‌లో చేరానని… మాధవరం కృష్ణారావు చెప్పారన్నారు.
First Published:  8 Jun 2015 6:10 AM GMT
Next Story