Telugu Global
NEWS

రేవంత్‌కు హైబీపీ : ఉస్మానియా వైద్యులు

ఓటుకు నోటు కేసులో అరెస్ట్‌ అయిన రేవంత్‌రెడ్డి తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారని ఉస్మానియా వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం ఉస్మానియాలో రేవంత్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. రేవంత్‌ మెడికల్‌ రిపోర్ట్‌పై వైద్యులు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి ఈసీజీ, షుగర్‌, యూరిన్‌ టెస్ట్‌లు చేశామన్నారు. రేవంత్‌రెడ్డికిహై బీపీ ఉంద‌న్నారు. ఆయ‌న‌ బీపీ 150/90గా న‌మోదయ్యింద‌న్నారు. ప్రస్తుతం రేవంత్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని, పరీక్షల తర్వాత విచారణకు అంగీకరించామని ఉస్మానియా వైద్యులు తెలిపారు.      రేవంత్ రెడ్డి అనారోగ్యం […]

రేవంత్‌కు హైబీపీ : ఉస్మానియా వైద్యులు
X
ఓటుకు నోటు కేసులో అరెస్ట్‌ అయిన రేవంత్‌రెడ్డి తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారని ఉస్మానియా వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం ఉస్మానియాలో రేవంత్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. రేవంత్‌ మెడికల్‌ రిపోర్ట్‌పై వైద్యులు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి ఈసీజీ, షుగర్‌, యూరిన్‌ టెస్ట్‌లు చేశామన్నారు. రేవంత్‌రెడ్డికిహై బీపీ ఉంద‌న్నారు. ఆయ‌న‌ బీపీ 150/90గా న‌మోదయ్యింద‌న్నారు. ప్రస్తుతం రేవంత్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని, పరీక్షల తర్వాత విచారణకు అంగీకరించామని ఉస్మానియా వైద్యులు తెలిపారు.
రేవంత్ రెడ్డి అనారోగ్యం కార‌ణంగా విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఎసీబీ అధికారులు చెబుతున్నారు. ఈ కార‌ణంగా మ‌రో రెండు రోజుల‌పాటు రేవంత్ క‌స్ట‌డీని పెంచాల‌ని తాము కోర్టును కోర‌నున్న‌ట్టు తెలుస్తోంది.
First Published:  8 Jun 2015 8:00 AM IST
Next Story