హస్తిన బాటలో గవర్నర్, ఇరు తెలుగు సీఎంలు, జగన్
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, ఎన్. చంద్రబాబునాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి, ఇరు రాష్ట్రాలకు గవర్నర్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్న నరసింహన్ ఢిల్లీ బాట పడుతున్నారు. ఆదివారం అనుకోకుండా గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు! ఆ తర్వాత కొద్ది సేపటికే గవర్నర్‌తో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు! వీరిద్దరి సమావేశం ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్ళాలని గవర్నర్ నరసింహన్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన వెనకే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హస్తిన […]
BY sarvi8 Jun 2015 11:55 AM IST
X
sarvi Updated On: 8 Jun 2015 11:56 AM IST
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, ఎన్. చంద్రబాబునాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి, ఇరు రాష్ట్రాలకు గవర్నర్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్న నరసింహన్ ఢిల్లీ బాట పడుతున్నారు. ఆదివారం అనుకోకుండా గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు! ఆ తర్వాత కొద్ది సేపటికే గవర్నర్‌తో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు! వీరిద్దరి సమావేశం ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్ళాలని గవర్నర్ నరసింహన్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన వెనకే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హస్తిన బాట పడుతున్నారు! టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై స్టింగ్ ఆపరేషన్; చంద్రబాబు, ఆయన ఆంతరంగిక సిబ్బంది ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న వివాదం.. తాజాగా, స్టీఫెన్సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులను విడుదల చేసిన నేపథ్యంలో వీరి పర్యటనలకు ప్రాధాన్యం ఏర్పడింది. చైనా ప్రతినిధి బృందంతో చర్చలకు చంద్రబాబు; నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంనేందుకు కేసీఆర్; ఢిల్లీ పెద్దలను కలిసేందుకు గవర్నర్ నరసింహన్ విడివిడిగా వెళుతున్నా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో ఏదో జరుగుతోందన్న అనుమానాలకు ఆస్కారం కలుగుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు ఢిల్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
గవర్నర్ ఈనెల 9న సాయంత్రం ఢిల్లీ వెళ్లి రెండు రోజులు అక్కడే ఉంటారు. అదేరోజు ఉదయం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పదో తేదీ వరకు ఉండి సాయంత్రానికి తిరిగి వస్తారు. వీరు తిరిగి వచ్చిన తర్వాత 12వ తేదీ సాయంత్రం కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. సీఎంల పర్యటనల్లో గవర్నర్ వద్ద జరిగిన పంచాయితీ మాదిరిగానే ఢిల్లీలో కూడా జరిగే అవకాశాలున్నాయి. వీరు ముగ్గురూ కూడా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలిసే అవకాశం లేకపోలేదు. మరి వీరిని కలిసే సమయంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలపై వివరించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ తమ వాదనలతో వీరిని కన్వీన్స్ చేసే ఆస్కారముంది. ఈ కలయిక ప్రస్తుత పరిస్థితిని క్రమబద్దీకరిస్తాయో… లేక నిప్పుకు మరికొంత ఆజ్యం పోస్తాయో చూడాలి. రాష్ట్ర విభజన దరిమిలా సీఎంల మధ్యే వివాదం చెలరేగడంతో ఢిల్లీ పెద్దలు పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తారని భావిస్తున్నారు.
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయించింది. ఇందులో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్లి మంగళవారం రాష్ట్రపతిని కలవనున్నారు. ఆ తర్వాతరోజు అంటే… బుధవారం కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. టీడీపీ ముడుపుల వ్యవహారంపై ఇప్పటికే గవర్నర్ నరసింహన్ కు వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేసింది.
Next Story