Telugu Global
Others

నా బిడ్డ‌ను నాకివ్వండి: ఓ త‌ల్లి ఆందోళ‌న

బిడ్డ ఆరోగ్యం బాలేదని ఆస్పత్రికి తీసుకుని వెళితే… బిడ్డను మార్చి చేతిలో పెట్టిన సంఘటన అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో జ‌రిగింది. త‌ల్లిదండ్రుల క‌థ‌నం ప్ర‌కారం… నాందేడ్ మండలం కిన్వత్ గ్రామానికి చెందిన ఆదివాసి దంపతులు వైశాలి, గజానంద్‌లకు మూడు రోజుల కిందట మగబిడ్డ జన్మించాడు. కాగా బాబు అనారోగ్యంతో ఉండటంతో వైద్యం చేయించుకోవడానికి రిమ్స్‌కు తీసుకు వెళ్లారు. అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు బాబును ఐసీయూలో ఉంచి.. సాయంత్రం మరో పిల్లాణ్ణి చేతికి […]

బిడ్డ ఆరోగ్యం బాలేదని ఆస్పత్రికి తీసుకుని వెళితే… బిడ్డను మార్చి చేతిలో పెట్టిన సంఘటన అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో జ‌రిగింది. త‌ల్లిదండ్రుల క‌థ‌నం ప్ర‌కారం… నాందేడ్ మండలం కిన్వత్ గ్రామానికి చెందిన ఆదివాసి దంపతులు వైశాలి, గజానంద్‌లకు మూడు రోజుల కిందట మగబిడ్డ జన్మించాడు. కాగా బాబు అనారోగ్యంతో ఉండటంతో వైద్యం చేయించుకోవడానికి రిమ్స్‌కు తీసుకు వెళ్లారు. అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు బాబును ఐసీయూలో ఉంచి.. సాయంత్రం మరో పిల్లాణ్ణి చేతికి ఇచ్చి పంపారు. ఈ బాబు మా బాబు కాదు అని తల్లిదండ్రులు నెత్తీనోరు బాదుకున్నా వినకుండా.. వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారు రిమ్స్ చైర్మన్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఆదివాసులంతా కలిసి ఆందోళన చేపట్టారు.
First Published:  7 Jun 2015 6:39 PM IST
Next Story