మొండి బకాయిలపై 12న బ్యాంకర్లతో జైట్లీ భేటీ
న్యూఢిల్లీ: సామర్ధ్య ప్రదర్శన, మొండి బకాయిల పరిస్థితిపై చర్చించేందుకు ఈ నెల 12న ప్రభుత్వరంగ బ్యాంకుల (పిఎస్‌బి) అధిపతులతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆర్‌బిఐ ప్రకటించిన వడ్డీరేట్ల తగ్గింపుకు అనుగుణంగా తమ తమ వడ్డీరేట్లను తగ్గించమలని బ్యాంకులను జైట్లీ కోరనున్నట్లు తెలిసింది. అంతేకాక జన్‌ధన్‌యోజన పురోగతి, రుణాల పంపిణీ, సామాజిక భద్రతా పథకాల పరిస్థితిపై సమీక్ష జరపనున్నారు. గత జనవరి నుంచి ఆర్‌బిఐ 0.75 శాతం వడ్డీరేట్లను తగ్గించిం ది. […]
BY Pragnadhar Reddy7 Jun 2015 7:17 PM IST
Pragnadhar Reddy Updated On: 9 Jun 2015 1:45 AM IST
న్యూఢిల్లీ: సామర్ధ్య ప్రదర్శన, మొండి బకాయిల పరిస్థితిపై చర్చించేందుకు ఈ నెల 12న ప్రభుత్వరంగ బ్యాంకుల (పిఎస్‌బి) అధిపతులతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆర్‌బిఐ ప్రకటించిన వడ్డీరేట్ల తగ్గింపుకు అనుగుణంగా తమ తమ వడ్డీరేట్లను తగ్గించమలని బ్యాంకులను జైట్లీ కోరనున్నట్లు తెలిసింది. అంతేకాక జన్‌ధన్‌యోజన పురోగతి, రుణాల పంపిణీ, సామాజిక భద్రతా పథకాల పరిస్థితిపై సమీక్ష జరపనున్నారు. గత జనవరి నుంచి ఆర్‌బిఐ 0.75 శాతం వడ్డీరేట్లను తగ్గించిం ది. అయినా అన్ని బ్యాంకులు ఈప్రయోజనాన్ని కస్టమర్లకు అందించడంలేదు. ఈ నేపథ్యంలో వడ్డీరేట్ల తగ్గింపు చేపట్టి, పెట్టుబడులు పెరిగేందుకు తోడ్పడాలని జైట్లీ పిఎ్‌సబి అధిపతులకు సూచించనున్నారు. బ్యాంకుల నెత్తిపై గుదిబండల్లా మారిన ఎన్‌పిఎలను వదిలించుకునే మార్గాలపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Next Story