Telugu Global
Others

సిట్ కార్యాలయంలోనే ఉంచండి: కోర్టు

ఓటుకు నోటు స్కాంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సిట్ కార్యాలయంలోనే ఉంచాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. సిట్ కార్యాలయంలో సరైన సౌకర్యాలు లేనందున ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలంటూ రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు చేసిన అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. అలాగే.. రేవంత్ కు తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని కూడా కోర్టు ఆదేశించింది. రేవంత్ రెడ్డికి సిట్ కార్యాలయంలో తాము మంచి సదుపాయాలే కల్పిస్తున్నామని అంతకుముందు […]

ఓటుకు నోటు స్కాంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సిట్ కార్యాలయంలోనే ఉంచాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. సిట్ కార్యాలయంలో సరైన సౌకర్యాలు లేనందున ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలంటూ రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు చేసిన అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. అలాగే.. రేవంత్ కు తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని కూడా కోర్టు ఆదేశించింది. రేవంత్ రెడ్డికి సిట్ కార్యాలయంలో తాము మంచి సదుపాయాలే కల్పిస్తున్నామని అంతకుముందు సిట్ అదనపు కమిషనర్ స్వాతి లక్రా చెప్పిన విషయం తెలిసిందే. ఆయనకు కొత్త బెడ్ షీట్లు, బెడ్లు ఏర్పాటు చేశామని, మినరల్ వాటర్ అందిస్తున్నామని కూడా ఆమె చెప్పారు.
First Published:  7 Jun 2015 1:43 PM GMT
Next Story