ఏపీలో కేసీఆర్‌పై కేసులు... దిష్టిబొమ్మల దగ్ధం
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తప్పుడు కేసులు బనాయించి ఆయనపై కక్ష సాధిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతపురం జిల్లా కదిరిలో, చిత్తూరు జిల్లా కుప్పంలో, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో, కృష్ణా జిల్లా విజయవాడలో, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో, నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెంలో, గుంటూరు జిల్లా నర్సరావుపేట, చిలకలూరిపేటల్లో చంద్రబాబును అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ కేసీఆర్ దిష్ఠిబొమ్మలను దగ్ధం చేశారు. పాలకొల్లులో కేసీఆర్ వైఖరికి నిరసనగా నలుగురు కార్యకర్తలు గుండు […]
BY sarvi8 Jun 2015 11:36 AM IST
X
sarvi Updated On: 8 Jun 2015 11:36 AM IST
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తప్పుడు కేసులు బనాయించి ఆయనపై కక్ష సాధిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతపురం జిల్లా కదిరిలో, చిత్తూరు జిల్లా కుప్పంలో, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో, కృష్ణా జిల్లా విజయవాడలో, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో, నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెంలో, గుంటూరు జిల్లా నర్సరావుపేట, చిలకలూరిపేటల్లో చంద్రబాబును అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ కేసీఆర్ దిష్ఠిబొమ్మలను దగ్ధం చేశారు. పాలకొల్లులో కేసీఆర్ వైఖరికి నిరసనగా నలుగురు కార్యకర్తలు గుండు చేయించుకొని నిరసన తెలిపారు. కొన్నిచోట్ల తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. పిఠాపురం టీడీపీ అధ్యక్షుడు రెడ్డెం భాస్కరరావు కేసీఆర్, నాయినిలపై కేసు పెట్టారు. కేసీఆర్, నాయినిలపై 120 బి, 153 ఏ, 465, 469, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పిఠాపురం ఎస్‌ఐ కొండయ్య చెప్పారు. పాలకొల్లు టౌన్ పోలీసుస్టేషనులో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు సీఎం కేసీఆర్‌పై సెక్షన్ 420, 120, 470, 472 ల కింద కేసు పెట్టారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు సీఎం చంద్రబాబుపై ఆడియో టేపులను విడుదల చేసి తప్పుడు కేసు బనాయించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్, హోంశాఖ మంత్రి నాయినిలపై డోన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డోన్ పోలీసులకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.
Next Story