ఎవరినీ రక్షించం: బీజేపీ ప్రధాన కార్యదర్శి
ఓటుకు నోటు వ్యవహారంలో తాము ఎవరినీ రక్షించం, నిజాన్ని దాచే ప్రయత్నం చేయమని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సంచలనాలకు దూరంగా దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకునే అధికారం ప్రజలకు ఉందన్నారు. విలువలతో కూడిన రాజకీయాలను బలోపేతం చేయడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కేంద్రం ఇప్పుడే జోక్యం చేసుకోవడం అవసరమని తాము భావించడం లేదని […]
BY Pragnadhar Reddy7 Jun 2015 7:15 PM IST
Pragnadhar Reddy Updated On: 9 Jun 2015 1:37 AM IST
ఓటుకు నోటు వ్యవహారంలో తాము ఎవరినీ రక్షించం, నిజాన్ని దాచే ప్రయత్నం చేయమని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సంచలనాలకు దూరంగా దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకునే అధికారం ప్రజలకు ఉందన్నారు. విలువలతో కూడిన రాజకీయాలను బలోపేతం చేయడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కేంద్రం ఇప్పుడే జోక్యం చేసుకోవడం అవసరమని తాము భావించడం లేదని మురళీధర రావు తెలిపారు.
Next Story