వేల ఏళ్లనాటి ముత్యం
ఆస్ట్రేలియాలోని కింబెర్లీ తీరంలోని బాగా మారుమూల ప్రాంతంలో అత్యంత పురాతనమైన ఓ ముత్యం లభించిందని యూనివర్సిటీ ఆఫ్ ఉల్లాన్గాంగ్ ప్రొఫెసర్ కాట్ జాబో వెల్లడించారు. గుండ్రటి ఆకారం, లేత గులాబీ వర్ణంలో మెరిసిపోతున్న ఈ ముత్యాన్ని ఆదిమ మానవుడు తయారు చేశాడని భావించారు. ఈ అరుదైన ముత్యానికి మరొకటి సాటిరాదని అభిప్రాయపడ్డారు. ఆపై ఎలాంటి నష్టం వాటిల్లకుండా పలు జాగ్రత్తలు తీసుకొని దీన్ని పరీక్షించగా.. ఈ ముత్యం 2 వేల ఏళ్లనాటిదని తేలింది. ఇది ఆల్చిప్ప గర్భంలో […]
BY admin7 Jun 2015 7:25 AM IST
X
admin Updated On: 7 Jun 2015 7:33 AM IST
ఆస్ట్రేలియాలోని కింబెర్లీ తీరంలోని బాగా మారుమూల ప్రాంతంలో అత్యంత పురాతనమైన ఓ ముత్యం లభించిందని యూనివర్సిటీ ఆఫ్ ఉల్లాన్గాంగ్ ప్రొఫెసర్ కాట్ జాబో వెల్లడించారు. గుండ్రటి ఆకారం, లేత గులాబీ వర్ణంలో మెరిసిపోతున్న ఈ ముత్యాన్ని ఆదిమ మానవుడు తయారు చేశాడని భావించారు. ఈ అరుదైన ముత్యానికి మరొకటి సాటిరాదని అభిప్రాయపడ్డారు. ఆపై ఎలాంటి నష్టం వాటిల్లకుండా పలు జాగ్రత్తలు తీసుకొని దీన్ని పరీక్షించగా.. ఈ ముత్యం 2 వేల ఏళ్లనాటిదని తేలింది. ఇది ఆల్చిప్ప గర్భంలో దశాబ్దం పాటు కొద్దికొద్దిగా ఆకారం సంతరించుకునే సహజమైన, అరుదైన ముత్యమని ఆస్ట్రేలియా పరిశోధకులు పేర్కొన్నారు. గతంలో ఆస్ట్రేలియాలో జరిపిన పురాతత్వ తవ్వకాలలో ఇలా ఓ ముత్యం లభించిన దాఖలాల్లేవని అన్నారు.
Next Story