మరో మూవీ మొదలెట్టాడు
ఈమధ్యే అసుర సినిమా వచ్చింది. నారా రోహిత్ పాత సినిమాల్లానే బాగుంది అనిపించుకుంది. కలెక్షన్లు రాకపోయినప్పటికీ రోహిత్ మార్క్ మాత్రం మరోసారి కనిపించింది అసుర సినిమాలో. అయితే ఆ సినిమా సక్సెస్ అయిందా.. ఫెయిలైందా లాంటి విషయాలేవీ పట్టించుకోవట్లేదు రోహిత్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్ట్స్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేశాడు. అప్పట్లో ఒకడుండేవాడు అనే టైటిల్ తో నారా రోహిత్ కొత్త సినిమా మొదలైంది. టైటిల్ చూస్తుంటే.. ఇది కూడా కాస్త విభిన్నమైన కథాంశంలానే కనిపిస్తోంది […]
BY admin7 Jun 2015 1:40 PM IST
X
admin Updated On: 7 Jun 2015 1:40 PM IST
ఈమధ్యే అసుర సినిమా వచ్చింది. నారా రోహిత్ పాత సినిమాల్లానే బాగుంది అనిపించుకుంది. కలెక్షన్లు రాకపోయినప్పటికీ రోహిత్ మార్క్ మాత్రం మరోసారి కనిపించింది అసుర సినిమాలో. అయితే ఆ సినిమా సక్సెస్ అయిందా.. ఫెయిలైందా లాంటి విషయాలేవీ పట్టించుకోవట్లేదు రోహిత్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్ట్స్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేశాడు. అప్పట్లో ఒకడుండేవాడు అనే టైటిల్ తో నారా రోహిత్ కొత్త సినిమా మొదలైంది. టైటిల్ చూస్తుంటే.. ఇది కూడా కాస్త విభిన్నమైన కథాంశంలానే కనిపిస్తోంది కదా.. అవును.. 1992 కాలంనాటి ఇద్దరు యువకుల మధ్య నడిచే కథతో ఇది రాబోతోంది. రోహిత్ తో సమానంగా మరో కీలకపాత్ర పోషించబోతున్నాడు శ్రీవిష్ణు. ఇంతకుముందు అయ్యారే లాంటి సినిమా తీసిన సాగర్ కె.చంద్ర డైరక్షన్ లో రాబోతోంది ఈ నయామూవీ. వచ్చే నెల మొదటివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. అయితే కథలతో పాటు తన ఫిజిక్ పై కూడా నారా రోహిత్ దృష్టి పెడితే బాగుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Next Story