ఆంధ్ర రాజధాని నిర్మాణానికి అంకురార్పణ
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కీలక ఘట్టం ముగిసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. సరిగ్గా 8 గంటల 49 నిమిషాలకు… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు శంకుస్థాపన చేశారు. వెండి గమెళాలో ఉంచిన సిమెంట్, ఇసుక మిశ్రమాన్ని బంగారు తాపీతో మూడుసార్లు బొడ్రాయి వద్ద వేశారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, డీజీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఉదయం 3 […]
BY sarvi6 Jun 2015 7:09 AM IST
X
sarvi Updated On: 6 Jun 2015 7:13 AM IST
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కీలక ఘట్టం ముగిసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. సరిగ్గా 8 గంటల 49 నిమిషాలకు… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు శంకుస్థాపన చేశారు. వెండి గమెళాలో ఉంచిన సిమెంట్, ఇసుక మిశ్రమాన్ని బంగారు తాపీతో మూడుసార్లు బొడ్రాయి వద్ద వేశారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, డీజీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఉదయం 3 గంటల నుంచే ఏపీ రాజధాని భూమి పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. పంచ నదుల నుంచి తెచ్చిన జలాలతో పాటు మానససరోవరం నుంచి తెప్పించిన ప్రత్యేక జలాలతో…. వేద పండితులు పూజలు, హోమాలు నిర్వహించారు.
ప్రపంచం గర్వించే స్థాయిలో రాజధాని: చంద్రబాబు
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాజధానిని నిర్మించుకునే అవకాశం జీవితంలో అందరికీ రాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తూ చంద్రబాబు తన ప్రసంగం ప్రారంభించారు. ఈ రైతులను జీవితంలో మరిచిపోలేనని చెబుతూ కట్టలేమనుకున్న రాజధానిని మనం బ్రహ్మాండంగా కట్టుకుంటాం అని ఆయన చెప్పినప్పు డు సభికులు కేరింతలు కొట్టారు. రాజధాని నిర్మించుకునే అవకాశం మనకు రావడం మన అదృష్టం అని ఆయన అన్నారు. సింగపూర్‌నుంచి వచ్చిన నిపుణులు సింగపూర్ కంటె మెరుగుగా మీ అమరావతి వస్తుందని చెప్పినప్పు డు తాను చాలా సంతోషంచానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అమరావతి అంటే దేవతలకు రాజధాని, దేవేంద్రుని రాజధాని అని ఆయన అన్నారు. ఇటువైపు కృష్ణమ్మని చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి కొండనైనా బద్దలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రతి ఒక్కరూ ఒక ఇటుకను, లేదా అంత విలువైన విరాళం ఇవ్వాలని ఆయన పిలుపు ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో మొదటి కూలీని తానే అంటూ భూమి ఇవ్వవద్దని ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఇక్కడి రైతులు ధైర్యంగా నిల్చున్నారని చంద్రబాబు ప్రశంసించారు. భూసేకరణ జరగడం దేశంలో ఇదే మొదటిసారి అని, ఇక్కడికి వచ్చినపుడు నాకు ఎక్కడికీ పోబుద్ధికావడం లేదని చంద్రబాబు చెప్పారు.
Next Story