ఆడియో లాంచ్‌కి ఫ్యాన్స్ ఎక్కువ రాకుండా రాజమౌళి ప్లానింగ్?
ముందుగా అనుకున్న ప్రకారం మే 29 న ‘బాహుబలి ‘ ఆడియో లాంచ్ జరగలేదు. దానికి ముఖ్య కారణం, సెక్యూరిటీ ఇష్యూల వలన హైటెక్స్ వెన్యూ ఆర్గనైజర్స్ లిమిటెడ్ ఆడియన్స్‌కి మాత్రమే ప్రవేశం ఇస్తామనడం. కాని ఫ్యాన్స్ హర్ట్ అవుతారని, కనుక ఫ్యాన్స్ అందరిని సంతృప్తి పరిచే వెన్యూ కోసం ప్లాన్ చేస్తున్నామని క్షమాపణలు కోరుతూ జక్కన్న స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ వివరించారు. ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఎక్కువ మంది […]
ముందుగా అనుకున్న ప్రకారం మే 29 న ‘బాహుబలి ‘ ఆడియో లాంచ్ జరగలేదు. దానికి ముఖ్య కారణం, సెక్యూరిటీ ఇష్యూల వలన హైటెక్స్ వెన్యూ ఆర్గనైజర్స్ లిమిటెడ్ ఆడియన్స్‌కి మాత్రమే ప్రవేశం ఇస్తామనడం. కాని ఫ్యాన్స్ హర్ట్ అవుతారని, కనుక ఫ్యాన్స్ అందరిని సంతృప్తి పరిచే వెన్యూ కోసం ప్లాన్ చేస్తున్నామని క్షమాపణలు కోరుతూ జక్కన్న స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ వివరించారు.
ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఎక్కువ మంది ఫ్యాన్స్ పాల్గొనేలా రామోజి ఫిల్మ్ సిటీ ఎంచుకున్నట్లు తెలుసోంది. కాని ఈ వెన్యూ గురించి అఫీషియల్‌గా మాత్రం కన్‌ఫర్మేషన్ లేదు. ఒకవేళ రామోజి ఫిల్మ్ సిటీనే ఖరారు చేస్తే మాత్రం, ఆ వెన్యూ ఫ్యాన్స్ సంఖ్య గురించి ప్రాబ్లం ఉండదు కాని, అందరూ రావడానికి మాత్రం సులువైన యాక్సెస్ ఉండదు.
సిటీ అవుట్‌స్కర్ట్స్‌లో ఉన్న ఆ వెన్యూకి చేరడానికి, తిరిగి వెళ్ళడానికి కష్టమే సాధారణ ఫ్యాన్స్‌కి అని ఒక టాక్. దాని బదులు సిటీలోనే ఏదో ఒక స్టేడియుం తీసుకుని, కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్ ‘ ఆడియో లాంచ్ చెన్నై స్టేడియంలో జరిపినట్లు చేస్తే బాగుంటుంది ఒక టాక్. మరి జూలై 7న జరుగుతుంది అంటున్న ఆడియో ఈవెంట్ కోసం రామోజి ఫిల్మ్ సిటీ కనఫర్మ్ అయ్యింది లేనిది తెలుసుకోడం కోసం వేచి చూడాల్సిందే.