Telugu Global
Others

తెలంగాణ‌లోనూ మ్యాగి నిషేధం

రాష్ట్రంలో మ్యాగి నూడిల్స్‌ను నిషేధిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. విక్రయాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హానీకర మ్యాగీ నమూనాలను అధికారులు ఐపీఎంకు పంపించారు. ల్యాబ్‌ నుంచి వచ్చిన ఫలితాల ఆధారంగా త‌దుపరి చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అయితే టెస్టు శాంపిల్స్‌ రాకుండానే మ్యాగీని నిషేధించిన తొలిరాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. మొత్తం పది జిల్లాల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షలకు పంపించగా, ఫలితాలకు వచ్చేందుకు రెండు వారాలు పట్టనుంది. కాగా […]

తెలంగాణ‌లోనూ మ్యాగి నిషేధం
X
రాష్ట్రంలో మ్యాగి నూడిల్స్‌ను నిషేధిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. విక్రయాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హానీకర మ్యాగీ నమూనాలను అధికారులు ఐపీఎంకు పంపించారు. ల్యాబ్‌ నుంచి వచ్చిన ఫలితాల ఆధారంగా త‌దుపరి చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అయితే టెస్టు శాంపిల్స్‌ రాకుండానే మ్యాగీని నిషేధించిన తొలిరాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. మొత్తం పది జిల్లాల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షలకు పంపించగా, ఫలితాలకు వచ్చేందుకు రెండు వారాలు పట్టనుంది. కాగా తెలంగాణ ప్రభుత్వం మ్యాగీ న్యూడిల్స్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సప్లై ఆగిపోయిందని, ఉన్న స్టాక్‌ను ఏం చేయాలో తెలియడంలేదని వారు వాపోతున్నారు. కొందరు ఇంకా మ్యాగీని అడుగుతున్నారని…పూర్తిగా అమ్మకాలు నిలిచిపోలేదని వ్యాపారులు చెబుతున్నారు.
మ్యాగీస్టాక్స్‌ వెనక్కి తీసుకున్నట్లు ప్రకటన
మ్యాగీ నూడిల్స్‌పై వివాదం కొనసాగుతన్న నేపథ్యంలో నెస్లే కంపెనీ వెనక్కి తగ్గింది. తమ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. మ్యాగీలో ఎలాంటి హానీకర పదార్థాలు లేవంటూనే వినియోగదారుల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో తాము అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మ్యాగీలో సీసం, మోనోసోడియం, గ్లూటామెట్‌ మోతాదుకు మించి ఉన్నట్లు యూపీ ప్రభుత్వం తేల్చడంతో పలు రాష్ర్టాలు దానిపై నిషేధం విధించాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మ్యాగీ నూడిల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
First Published:  5 Jun 2015 7:25 AM IST
Next Story