Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 104

“ఆకాష్‌ ఇంటికి వచ్చి చూస్తే పనిమనిషి ఏడుస్తూ కనిపించింది”. “లక్ష్మీ! ఎందుకు ఏడుస్తున్నావు?” అడిగాడు “అమ్మగారు కొట్టింది సార్‌!” “ఐతే ఏడవడమేనా? నేను ఏడవంగా ఎప్పుడయినా చూశావా?” —————————————– “నువ్వెప్పుడయినా జైల్లో ఉన్నావా?” జడ్జి “లేదు సార్‌” దొంగ “ఐతే నీకు ఆ అవకాశమిస్తున్నా” జడ్జి —————————————– కండక్టర్‌: పన్నెండేళ్ళలోపు వాళ్ళకు ఆఫ్‌ టికెట్‌. నీ వయసెంత బాబు బాబు: పదకొండు కండక్టర్‌: నీకు పన్నెండేళ్ళెప్పుడొస్తాయి? బాబు: బస్సు దిగాక! —————————————– “నరేష్‌! మీ నాన్న నెలకు […]

“ఆకాష్‌ ఇంటికి వచ్చి చూస్తే పనిమనిషి ఏడుస్తూ కనిపించింది”.
“లక్ష్మీ! ఎందుకు ఏడుస్తున్నావు?” అడిగాడు
“అమ్మగారు కొట్టింది సార్‌!”
“ఐతే ఏడవడమేనా? నేను ఏడవంగా ఎప్పుడయినా చూశావా?”
—————————————–
“నువ్వెప్పుడయినా జైల్లో ఉన్నావా?” జడ్జి
“లేదు సార్‌” దొంగ
“ఐతే నీకు ఆ అవకాశమిస్తున్నా” జడ్జి
—————————————–
కండక్టర్‌: పన్నెండేళ్ళలోపు వాళ్ళకు ఆఫ్‌ టికెట్‌. నీ వయసెంత బాబు
బాబు: పదకొండు
కండక్టర్‌: నీకు పన్నెండేళ్ళెప్పుడొస్తాయి?
బాబు: బస్సు దిగాక!
—————————————–
“నరేష్‌! మీ నాన్న నెలకు 50 వేలు సంపాదిస్తూ మీ అమ్మకు 25 వేలు ఇస్తే మీ అమ్మ పరిస్థితి ఎలా ఉంటుంది?”
“హార్ట్‌ ఎటాక్‌ వచ్చి హాస్పిటల్లో చేరుతుంది.”

First Published:  4 Jun 2015 6:33 PM IST
Next Story