ఒక్కసారే పెరిగిన చికెన్ ధర రూ. 200
వడదెబ్బకు పెద్ద ఎత్తున కోళ్లు చనిపోవడంతో దాని ప్రభావం ధరలపై కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా బ్రాయిలర్ చికెన్ ధర క్రమం గా పెరుగుతోంది. నిన్నమొన్నటి వరకు 150 నుంచి 170 రూపాయలున్న చికెన్ ధర తాజాగా స్కిన్‌లెస్ చికెన్ ధర 220 రూ పాయల స్థాయికి ఎగబాకింది. ఎపి, తెలంగాణలోని జిల్లా ల్లో కిలో కోడి ఫామ్ గేట్ ధర 102-112 రూపాయల మధ్య ఉంది. స్కిన్‌లెస్ చికెన్ ధర మాత్రం 200-220 రూపాయలకు పెంచేశారు. […]
BY sarvi4 Jun 2015 1:27 PM GMT
X
sarvi Updated On: 5 Jun 2015 1:51 AM GMT
వడదెబ్బకు పెద్ద ఎత్తున కోళ్లు చనిపోవడంతో దాని ప్రభావం ధరలపై కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా బ్రాయిలర్ చికెన్ ధర క్రమం గా పెరుగుతోంది. నిన్నమొన్నటి వరకు 150 నుంచి 170 రూపాయలున్న చికెన్ ధర తాజాగా స్కిన్‌లెస్ చికెన్ ధర 220 రూ పాయల స్థాయికి ఎగబాకింది. ఎపి, తెలంగాణలోని జిల్లా ల్లో కిలో కోడి ఫామ్ గేట్ ధర 102-112 రూపాయల మధ్య ఉంది. స్కిన్‌లెస్ చికెన్ ధర మాత్రం 200-220 రూపాయలకు పెంచేశారు. కొన్ని మార్కెట్లలో ఇంతకన్నా ఎక్కువ ధరకే చికెన్‌ను విక్రయిస్తున్నారు. తాజా పరిస్థితులను బట్టి చూస్తే ధరలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. రెండు రాష్ర్టాల్లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడినప్పటికీ వాతావరణం మాత్రం ఏమీ చల్లబడలేదు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈసారి కోళ్ల మరణాలు ఎక్కువగా ఉండటంతో రైతులకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. తాజాగా చికెన్ ధరలు పెరిగినప్పటికీ కొంత మంది రైతులకు మాత్రమే ఊరట లభించే అవకాశం ఉంది. అనేక పౌల్ట్రీ ఫారాల్లో వేల సంఖ్యలో కోళ్ళు చనిపోయాయి. దీంతో పెరిగిన ధరల వల్ల లాభపడే వారు కొంతమందే ఉంటారు.
Next Story