Telugu Global
Others

డిసెంబ‌ర్ నాటికి ఏపీలో రూ.100కే ఇంటర్నెట్‌..

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి రూ.100 నుంచి 150లకు పోన్‌, కేబుల్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. 10 నుంచి 15 ఎంబీపీఎస్‌ స్పీడుతో ఇంటర్నెట్‌ అందించనున్నట్లు తెలిపారు. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో జరిగిన జన్మభూమి-మా ఊరు సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌, కేబుల్‌, ఫోన్‌ కనెక్షన్లను అతి తక్కువ ధరకు అందించేందుకు రూ.200 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం […]

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి రూ.100 నుంచి 150లకు పోన్‌, కేబుల్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. 10 నుంచి 15 ఎంబీపీఎస్‌ స్పీడుతో ఇంటర్నెట్‌ అందించనున్నట్లు తెలిపారు. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో జరిగిన జన్మభూమి-మా ఊరు సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌, కేబుల్‌, ఫోన్‌ కనెక్షన్లను అతి తక్కువ ధరకు అందించేందుకు రూ.200 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు స్తంభాలపై ప్రత్యేక లైన్లు వేయిస్తామన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూ.5 వేల కోట్లతో భూగర్భ కేబుల్స్‌ వేయనున్నట్టు చెప్పారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని తెలిపారు. ఫైబర్‌ కనెక్టివిటీ ద్వారా ఒకే సమయంలో టీవీ, ఇంటర్నెట్‌, ఫోన్‌ తదితర సౌకర్యాలన్నీ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఒకటిరెండు రోజుల్లో నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రాజకీయ అవినీతి మహానేరమని, పేదలకు దక్కాల్సిన సొమ్ము దోచుకోవడం పాపమని చంద్రబాబు పేర్కొన్నారు.
First Published:  4 Jun 2015 6:34 PM IST
Next Story