స్టింగ్‌ ఆపరేషన్‌లకు విలువ‌లేదు: ఏపీ హోం మంత్రి 
Telugu Global
NEWS

స్టింగ్‌ ఆపరేషన్‌లకు విలువ‌లేదు: ఏపీ హోం మంత్రి 

స్టింగ్‌ ఆపరేషన్‌ టేపులు చెల్లవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. స్టింగ్‌ ఆపరేషన్‌ టేపులతో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై కేసు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధాని అని చట్టంలో ఉన్నా, ఏపీ ప్రజాప్రతినిధులు, అధికారుల ఫోన్‌లను ట్యాప్‌ చేస్తున్నారని, ఇది దుర్గార్ఘమని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ గెలిచిన సీట్ల కన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 22 ఓట్లు ఎలా ఎక్కువ తెచ్చుకుందో […]

స్టింగ్‌ ఆపరేషన్‌లకు విలువ‌లేదు: ఏపీ హోం మంత్రి 
X
స్టింగ్‌ ఆపరేషన్‌ టేపులు చెల్లవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. స్టింగ్‌ ఆపరేషన్‌ టేపులతో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై కేసు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధాని అని చట్టంలో ఉన్నా, ఏపీ ప్రజాప్రతినిధులు, అధికారుల ఫోన్‌లను ట్యాప్‌ చేస్తున్నారని, ఇది దుర్గార్ఘమని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ గెలిచిన సీట్ల కన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 22 ఓట్లు ఎలా ఎక్కువ తెచ్చుకుందో చెప్పాలని చినరాజప్ప డిమాండ్‌ చేశారు. 63 మంది ఎమ్మెల్యేలున్న టీఆర్ఎస్‌కు 85 ఓట్లు ఎలా వ‌చ్చాయో అర్ధం చేసుకుంటే ఎమ్మెల్యేల‌ను ఎవ‌రు కొన్నారో అర్ధం అవుతుంద‌ని, రేవంత్‌ను దొంగ‌గా చూపిస్తున్న టీఆర్ఎస్ నాయ‌కులు త‌మ పార్టీలో దొంగ‌లెవ‌రో ప్ర‌క‌టించాల‌ని, అద‌నంగా 22 మంది ఎమ్మెల్యేలు ఎలా ఓటు వేశారో విడ‌మ‌రిచి చెప్పాల‌ని ఆయ‌న డిమాండు చేశారు.
First Published:  5 Jun 2015 5:10 AM
Next Story