అందుకే నిర్మాత అయ్యాడట..!
సినిమా అంటే నచ్చని వాళ్లు తక్కువ మంది వుంటారు.ఇక సినిమా హీరోలకు సినిమా అంటే ఎంతో ఆసక్తి ప్రేమ వుంటాయి. కొందరు కేవలం నటించి కొంత పేరు.. డబ్బు సంపాదించుకుని హాయగా లైఫ్ లీడ్ చేస్తుంటారు. చాల కొద్ది మంది మాత్రమే సినిమాలో సంపాదించింది తిరిగి సినిమా మీదనే పెట్టు బడి పెట్టే వారుంటారు. హీరో నారా రోహిత్ ఈ కోవాలోకే వస్తాడు. బాణం చిత్రంతో హీరోగా పరిచయమైన నారా రోహిత్.. ఆ […]
BY admin4 Jun 2015 7:12 AM IST
X
admin Updated On: 4 Jun 2015 7:20 AM IST
సినిమా అంటే నచ్చని వాళ్లు తక్కువ మంది వుంటారు.ఇక సినిమా హీరోలకు సినిమా అంటే ఎంతో ఆసక్తి ప్రేమ వుంటాయి. కొందరు కేవలం నటించి కొంత పేరు.. డబ్బు సంపాదించుకుని హాయగా లైఫ్ లీడ్ చేస్తుంటారు. చాల కొద్ది మంది మాత్రమే సినిమాలో సంపాదించింది తిరిగి సినిమా మీదనే పెట్టు బడి పెట్టే వారుంటారు. హీరో నారా రోహిత్ ఈ కోవాలోకే వస్తాడు.
బాణం చిత్రంతో హీరోగా పరిచయమైన నారా రోహిత్.. ఆ తరువాత సోలో, ప్రతినిధి, రౌడి ఫెలో చిత్రాలతో పేరు సంపాదించాడు. అతని నుంచి సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా కథా బలం వుంటుందనే నమ్మకాన్ని అభిమానులకు కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. తాజాగా అసుర చిత్రం కూడా ప్రామిసింగ్ ఫిల్మ్ అంటున్నారు. కథ పరంగా తన క్యారెక్టరైజేషన్ రాక్షసుడిలా పనిచేసే ఒక పోలీసాఫిసర్. రాక్షసుల్ని చంపితే పురాణల్లో మంచి వాళ్లున్నారు. అదే సోసైటి లో రాక్షసుల్ని చంపుతుంటే..బ్యాడ్ అంటుంది వ్యవస్థ అందుకే గుడ్ ఈజ్ బ్యాడ్ అనే ట్యాగ్ లైన్ తో సినిమా చేశారట దర్శకుడు బాగా చేశారని భరోసా ఇస్తున్నారు. ఇక ఈ చిత్రంలో తను ఒక సహ నిర్మాతగా చేశారు. సినిమా అంటే ఉన్న ప్రేమే తనను నిర్మాతను చేసిందంటున్నారు. ఎనీ వే ఆల్ ది బెస్ట్ టు నారా రోహిత్ అండ్ టీమ్ .
Next Story