అవినీతిలో చంద్రబాబుకు 200 మార్కులు
చంద్రబాబుకు ఏపీలో సుపరిపాలనకు సున్నా మార్కులు…అవినీతిలో నూటికి 200 మార్కులు వచ్చాయని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ గత సంవత్సరం ఖాళీగా ఉన్న టీడీపీ బ్యాలెన్స్ షీట్‌లో ప్రస్తుతం రూ.87 కోట్ల బడ్జెట్ వచ్చిందన్నారు. అవినీతిలో ప్రభుత్వం బండారం ఇప్పుడు బయటపడుతోందని ఆయన తెలిపారు. తెలంగాణలో ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం రూ.100 కోట్లు పెట్టుకున్నారని, చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సైతం డబ్బు ఇచ్చేందుకు సిద్ధపడ్డారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో […]
BY sarvi4 Jun 2015 9:13 AM IST
X
sarvi Updated On: 4 Jun 2015 9:13 AM IST
చంద్రబాబుకు ఏపీలో సుపరిపాలనకు సున్నా మార్కులు…అవినీతిలో నూటికి 200 మార్కులు వచ్చాయని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ గత సంవత్సరం ఖాళీగా ఉన్న టీడీపీ బ్యాలెన్స్ షీట్‌లో ప్రస్తుతం రూ.87 కోట్ల బడ్జెట్ వచ్చిందన్నారు. అవినీతిలో ప్రభుత్వం బండారం ఇప్పుడు బయటపడుతోందని ఆయన తెలిపారు. తెలంగాణలో ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం రూ.100 కోట్లు పెట్టుకున్నారని, చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సైతం డబ్బు ఇచ్చేందుకు సిద్ధపడ్డారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్‌లో మహానాడును పెట్టారన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని రఘువీరా ప్రకటించారు. పోటీచేసేందుకు కావాల్సి బలం తమకు లేదని….అలాగే మరే పార్టీకి మద్దతివ్వమని స్పష్టం చేశారు. చంద్రబాబు, కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా సెంటిమెంట్, విభజన పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని రఘువీరారెడ్డి మండిపడ్డారు.
Next Story