గంటపాటు తెరుచుకోని విమానం తలుపులు
గన్నవరం నుంచి బుధవారం బెంగుళూరు బయలు దేరి వెళ్లాల్సిన ఎయిర్‌కోస్తా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానానికి ఉన్న రెండు ఇంజన్లలో ఒకటి చెడి పోవడంతో విమానం మొరాయించింది. విమానంలో మొత్తం 66 మంది ప్రయాణికులు ఎక్కారు. ఒక ఇంజన్ చెడి పోవడంతో రెండో ఇంజన్ ద్వారా అయినా స్టార్ట్ చేయడానికి పైలట్ ప్రయత్నించారు. అది కూడా వీలు కాకపోవడంతో విమానం నిలిచిపోయింది. ప్రయాణికులు బయటకు వద్దామంటే తలుపులు తెరుచుకోలేదు. గంటపాటు విమానం లోపల ఉన్న ప్రయాణికులు […]
BY sarvi3 Jun 2015 6:37 PM IST
sarvi Updated On: 4 Jun 2015 5:25 AM IST
గన్నవరం నుంచి బుధవారం బెంగుళూరు బయలు దేరి వెళ్లాల్సిన ఎయిర్‌కోస్తా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానానికి ఉన్న రెండు ఇంజన్లలో ఒకటి చెడి పోవడంతో విమానం మొరాయించింది. విమానంలో మొత్తం 66 మంది ప్రయాణికులు ఎక్కారు. ఒక ఇంజన్ చెడి పోవడంతో రెండో ఇంజన్ ద్వారా అయినా స్టార్ట్ చేయడానికి పైలట్ ప్రయత్నించారు. అది కూడా వీలు కాకపోవడంతో విమానం నిలిచిపోయింది. ప్రయాణికులు బయటకు వద్దామంటే తలుపులు తెరుచుకోలేదు. గంటపాటు విమానం లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు విమానాశ్రయంలో ఉన్న కొందరు తలుపులు తెరుచుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు ఊపిరి పీల్చుకుని బయట పడ్డారు
Next Story