ఏపీకి 300 నిట్ సీట్లు.. ఏలూరు బదులు తాడేపల్లిలో!
ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రయత్నాలు ఫలించాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటి-నిట్) కి రికార్డు స్థాయిలో 540 సీట్లు కేటాయించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో అసలు సీట్లు 480 కాగా .. సూపర్ న్యూమరరీ కింద మరో 60 సీట్లు ఇవ్వనున్నారు. ఏపీ ‘నిట్’ కు వచ్చే మొత్తం 540 సీట్లలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 300 సీట్లు దక్కనున్నాయి. హోం స్టేట్ కోటా (50 శాతం) కింద వచ్చే 240 సీట్ల […]
BY Pragnadhar Reddy4 Jun 2015 2:36 AM IST
Pragnadhar Reddy Updated On: 4 Jun 2015 2:36 AM IST
ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రయత్నాలు ఫలించాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటి-నిట్) కి రికార్డు స్థాయిలో 540 సీట్లు కేటాయించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో అసలు సీట్లు 480 కాగా .. సూపర్ న్యూమరరీ కింద మరో 60 సీట్లు ఇవ్వనున్నారు. ఏపీ ‘నిట్’ కు వచ్చే మొత్తం 540 సీట్లలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 300 సీట్లు దక్కనున్నాయి. హోం స్టేట్ కోటా (50 శాతం) కింద వచ్చే 240 సీట్ల (480 సీట్లలో సగం)కు అదనంగా సూపర్ న్యుమరరీ కింద కేటాయించే 60 సీట్లు కూడా ఏపీ విద్యార్థులకే వస్తాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే ఏపీ ‘నిట్’లో అడ్మిషన్లు జరుగుతాయి. కాగా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీని రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.మాణిక్యాల రావు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ కంభంపాటి హరిబాబు కలిసి ‘నిట్’ సీట్ల కేటాయింపు, అడ్మిషన్ల గురించి చర్చించారు. ఇదిలా ఉండగా .. గతంలో పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో ‘నిట్’ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా.. ఆ ప్రదేశానికి బదులుగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు గంటా తెలిపారు. ఇదే విషయాన్ని మంత్రి మాణిక్యాలరావు కూడా ధ్రువీకరించారు. ‘నిట్’ తరగతులను తాత్కాలికంగా ఏలూరులోని సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తారు.
Next Story