Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 103

తండ్రి కొడుకుతో “రాత్రంతా ఎక్కడున్నావురా లేటుగా వచ్చావు?” అన్నాడు. “మన కొత్త మారుతీ కార్లో నా ఫ్రెండ్స్‌తో కలిసి నెక్లెస్‌రోడ్‌లో గడిపాను డాడీ!” “మంచిదే కానీ నీ స్నేహితుల చేతి గాజుల ముక్కలు వెనక సీట్లో ఉన్నాయి. ఇంకోసారి వాటిని అలా కార్లోనే వదిలేయొద్దని చెప్పు. కూర్చుంటే గుచ్చుకుంటాయి.” ——————————— ఇద్దరు తాగుబోతులు రైలుపట్టాలపై వెళుతున్నారు. మొదటివాడు: “అరే! ఈ బిల్డింగ్‌ ఎంత పెద్దగా ఉంది. ఎక్కేకొద్దీ వస్తోంది” అన్నాడు. రెండోవాడు: “అదిగో! మేడపైకి ఎక్కేశాం. సూర్యుడు […]

తండ్రి కొడుకుతో “రాత్రంతా ఎక్కడున్నావురా లేటుగా వచ్చావు?” అన్నాడు.
“మన కొత్త మారుతీ కార్లో నా ఫ్రెండ్స్‌తో కలిసి నెక్లెస్‌రోడ్‌లో గడిపాను డాడీ!”
“మంచిదే కానీ నీ స్నేహితుల చేతి గాజుల ముక్కలు వెనక సీట్లో ఉన్నాయి.
ఇంకోసారి వాటిని అలా కార్లోనే వదిలేయొద్దని చెప్పు. కూర్చుంటే గుచ్చుకుంటాయి.”
———————————
ఇద్దరు తాగుబోతులు రైలుపట్టాలపై వెళుతున్నారు.
మొదటివాడు: “అరే! ఈ బిల్డింగ్‌ ఎంత పెద్దగా ఉంది. ఎక్కేకొద్దీ వస్తోంది” అన్నాడు.

రెండోవాడు: “అదిగో! మేడపైకి ఎక్కేశాం. సూర్యుడు కూడా కనిపిస్తున్నాడు” అన్నాడు ఎదురుగా వస్తున్న రైలు లైటు చూసి.
———————————
“సినిమా ఎలా ఉంది” దర్శకుడు తన దగ్గరి స్నేహితుణ్ణి అడిగాడు.
“చాలా బాగుంది. మరీ సినిమా చివరి ఐదు నిముషాలు అద్భుతంగా ఉంది”.
“సినిమా చివర ఆ టెంపో రావడానికి చాలా శ్రమించాను”
“ఆ చివరి ఐదు నిముషాలు ఒక గంట ముందు వస్తే మరింత అద్భుతంగా ఉండేదన్నది నా అభిప్రాయం”.
————————————-
రాకేష్‌: రామూ! నేను రేపు తెల్లవారుజామున 5 గంటల ట్రెయిన్‌కు వెళ్ళాలి. నన్ను 4:30కు లేపు.
రాము: తప్పకుండా. నన్ను 4 గంటలకు లేపితే నిన్ను 4:30కు తప్పకుండా లేపుతా.

First Published:  3 Jun 2015 6:33 PM IST
Next Story