బాబుది నయవంచన దీక్ష: సీఆర్
ఓటుకునోటు కేసులో ఆయన పాత్ర కూడా ఉందని వార్తలొస్తున్న దృష్ట్యా ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య డిమాండు చేశారు. అసలు అవినీతిపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని, సీఎంగా చంద్రబాబు ఉన్నందున ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోను బేరసారాలు జరిగే అవకాశం ఉందని రామచంద్రయ్య అనుమానం వ్యక్తం చేశారు. బాబుది నవ నిర్మాణ దీక్ష కాదని, అది నయవంచన దీక్ష అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ విభజన కుట్రగా చంద్రబాబు తరచూ […]
BY sarvi2 Jun 2015 6:47 PM IST
sarvi Updated On: 3 Jun 2015 8:52 AM IST
ఓటుకునోటు కేసులో ఆయన పాత్ర కూడా ఉందని వార్తలొస్తున్న దృష్ట్యా ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య డిమాండు చేశారు. అసలు అవినీతిపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని, సీఎంగా చంద్రబాబు ఉన్నందున ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోను బేరసారాలు జరిగే అవకాశం ఉందని రామచంద్రయ్య అనుమానం వ్యక్తం చేశారు. బాబుది నవ నిర్మాణ దీక్ష కాదని, అది నయవంచన దీక్ష అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ విభజన కుట్రగా చంద్రబాబు తరచూ చెబుతున్నారని, నిజంగా అది కుట్ర అయితే విభజించడానికి అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు కూడా కుట్రదారుడే అని ఆయన ఆరోపించారు. బాబు అవినీతి ప్రభుత్వాన్ని మిత్రపక్షంగా చూస్తారో లేదో ప్రధాని మోడీ తేల్చుకోవాలని ఆయన అన్నారు. రేవంత్ ఎపిసోడ్‌లో చంద్రబాబు మౌనమే ఆయన అవినీతిని ప్రోత్సహించారనడానికి అద్దం పడుతోందని రామచంద్రయ్య ఆరోపించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని ఆయన విమర్శించారు.
Next Story