Telugu Global
Others

18 నుంచి టెన్త్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఏపీలో ఈనెల 18వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష రుసుంను అపరాధ రుసుం లేకుండా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఈనెల 6 లోగా చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు ట్రెజరీల ద్వారా 8 లోగా టెన్త్ బోర్డుకు చెల్లించాలని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు కంప్యూటర్‌, ఎక్స్‌ట్రాక్టెడ్‌ నామినల్‌ రోల్స్‌, చలానా, మార్కుల మెమో, కవరింగ్‌ లెటర్‌తోపాటు పదో తేదీ లోగా డిప్యూటీ డీఈవోలకు అందజేయాలని పేర్కొన్నారు. ఆరో తేదీ […]

ఏపీలో ఈనెల 18వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష రుసుంను అపరాధ రుసుం లేకుండా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఈనెల 6 లోగా చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు ట్రెజరీల ద్వారా 8 లోగా టెన్త్ బోర్డుకు చెల్లించాలని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు కంప్యూటర్‌, ఎక్స్‌ట్రాక్టెడ్‌ నామినల్‌ రోల్స్‌, చలానా, మార్కుల మెమో, కవరింగ్‌ లెటర్‌తోపాటు పదో తేదీ లోగా డిప్యూటీ డీఈవోలకు అందజేయాలని పేర్కొన్నారు. ఆరో తేదీ తరువాత రూ.50 అపరాధ రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.
First Published:  2 Jun 2015 7:05 PM IST
Next Story