Telugu Global
Cinema & Entertainment

సూర్య 'తెలివి' ప‌ని చేసింది...!

మాస్  చిత్రాలతో ఎంత‌టి స్టార్ హీరో అయిన  ఎక్కువ కాలం అభిమానుల్ని ఇంప్రెస్ చేయ‌లేరు. ఈ విష‌యం అర్ధం చేసుకోలేని స్టార్ హీరోలు  త‌మ కెరీర్ గ్రాఫ్ ను దారుణంగా  డాన్ చేసుకుంటున్నారు.  తెలుగు, త‌మిళ్, హింది లాంగ్వేజ్ ఏదైనా ప్రేక్ష‌కులు అభిరుచుల్లో ఎన్నో మార్పులు వ‌చ్చాయి. ఏది ప‌డితే అది తీసి జ‌నాల మీద‌కు వ‌దిలితే చూసే  రోజులు పోయాయి.. పెద్ద హీరోలైన‌.. పెద్ద బ‌డ్జెట్ చిత్రాల నాయ‌కులైన‌..క‌థ‌లో వైవిధ్యం ఉండేలా చూసుకుని సినిమా  చేయ‌క […]

సూర్య తెలివి ప‌ని చేసింది...!
X

మాస్ చిత్రాలతో ఎంత‌టి స్టార్ హీరో అయిన ఎక్కువ కాలం అభిమానుల్ని ఇంప్రెస్ చేయ‌లేరు. ఈ విష‌యం అర్ధం చేసుకోలేని స్టార్ హీరోలు త‌మ కెరీర్ గ్రాఫ్ ను దారుణంగా డాన్ చేసుకుంటున్నారు. తెలుగు, త‌మిళ్, హింది లాంగ్వేజ్ ఏదైనా ప్రేక్ష‌కులు అభిరుచుల్లో ఎన్నో మార్పులు వ‌చ్చాయి. ఏది ప‌డితే అది తీసి జ‌నాల మీద‌కు వ‌దిలితే చూసే రోజులు పోయాయి.. పెద్ద హీరోలైన‌.. పెద్ద బ‌డ్జెట్ చిత్రాల నాయ‌కులైన‌..క‌థ‌లో వైవిధ్యం ఉండేలా చూసుకుని సినిమా చేయ‌క పోతే.. రెండో రోజే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈగ‌లు తోలుకుంటున్న రోజులు ఇవి.
న‌టుడిగా సూర్య ఎంత‌టి రాక్ష‌సుడో తెలిసిందే. ఒక్క‌నిముషం స్క్రీన్ మీద క‌నిపించినా.. త‌న ఉనికిని ఘ‌నంగా చాటుకోగ‌ల గొప్ప న‌టుడు. యాక్టింగ్ ప‌ట్ల త‌న క‌మిట్ మెంట్ సినిమాలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అదే తాజాగా వచ్చిన రాక్ష‌సుడు చిత్రంలో క‌నిపించింది. రాక్ష‌సుడు రెగ్యుల‌ర్ ఫిల్మ్ కాదు. ఫార్మూలా సినిమా అస‌లు కాదు. ప‌లు రకాల జోనర్స్ క‌ల‌పి డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు సినిమాను మంచి స్క్రీన్ ప్లే తో వండి వడ్డించారు. న‌టుడిగా సూర్య పాస్ అయ్యాడు. సినిమా అభిమానుల్ని మెప్పిస్తుంది. మ‌రి మాస్ చిత్రాలు ఇష్ట‌ప‌డే వారికి కొంత న‌చ్చ‌క పోవ‌చ్చు త‌ప్ప‌.. శాతం ఆడియ‌న్స్ కు న‌చ్చుతుంది. ఒక చిన్న ప్ర‌యోగానికి సూర్య తెగించి చేయ‌డం రాక్ష‌సుడు రూపంలో వ‌ర్కువుట్ అయ్యింద‌నే చెప్పాలి. ప్ర‌తిసారి హై వోల్టోజ్ యాక్ష‌న్ చిత్రాలు చేస్తే.. మూడు నాలుగు చేసిన త‌రువాత .. అదే త‌ర‌హాలో చేయ‌డానికి ఏమి ఉండ‌దు క‌దా..! అందుకే తెలివిగా సూర్య అప్ప‌డ‌ప్పుడు ఇలా ట‌ర్న్ తీసుకోవ‌డం మంచి నిర్ణయ‌మే క‌దా.!

First Published:  2 Jun 2015 5:08 AM GMT
Next Story