Telugu Global
Others

కుప్ప‌కూలిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం  భారీ న‌ష్టాల‌ను చ‌వి చూశాయి. సెన్సెక్స్ 661 పాయింట్లు న‌ష్ట‌పోయి 27188 వ‌ద్ద ముగిసింది. నిఫ్టి 197 పాయింట్లు న‌ష్ట‌పోయి  8236 వ‌ద్ద ముగిసింది. దాదాపు ప్ర‌ధాన స్టాక్స్ అన్నీ న‌ష్టాల బాట‌నే ప‌ట్టాయి. ఆటో, రియాల్టీ , బ్యాంకింగ్, ఐటి షేర్లు  బాగా నష్ట పోయాయి. బ్యాంకు నిష్టి 639 పాయింట్లు న‌ష్ట‌పోయింది. మరోవైపు  డాలర్ తో పోలిస్తే రూపాయి కాస్త బ‌ల‌ప‌డింది. బంగారం, వెండి రేట్లు కూడా కాస్త […]

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ న‌ష్టాల‌ను చ‌వి చూశాయి. సెన్సెక్స్ 661 పాయింట్లు న‌ష్ట‌పోయి 27188 వ‌ద్ద ముగిసింది. నిఫ్టి 197 పాయింట్లు న‌ష్ట‌పోయి 8236 వ‌ద్ద ముగిసింది. దాదాపు ప్ర‌ధాన స్టాక్స్ అన్నీ న‌ష్టాల బాట‌నే ప‌ట్టాయి. ఆటో, రియాల్టీ , బ్యాంకింగ్, ఐటి షేర్లు బాగా నష్ట పోయాయి. బ్యాంకు నిష్టి 639 పాయింట్లు న‌ష్ట‌పోయింది. మరోవైపు డాలర్ తో పోలిస్తే రూపాయి కాస్త బ‌ల‌ప‌డింది. బంగారం, వెండి రేట్లు కూడా కాస్త పెరిగాయి. వినియోగదారులపై వడ్డీ భారం తగ్గించాలంటూ బ్యాంకులకు బలమైన సంకేతాలు ఇస్తూ రిజర్వు బ్యాంక్‌ మంగళవారం తాజా నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణ‌య ప్ర‌భావం వ‌ల్లే స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూలిపోవ‌డానికి కార‌ణంగా భావిస్తున్నారు. మ‌రోవైపు దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఉత్సాహం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రఘురామరాజన్‌ వెల్లడించారు. 2015-16 ఆర్థిక ఏడాదికి ద్రవ్య విధానాన్ని సమీక్షించిన ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. ఏడున్నర శాతంగా ఉన్న రెపో రేటును 7.25 శాతానికి తగ్గించింది. ఈ ప్రయత్నాన్ని వినియోగదారులకు అందజేయాలని బ్యాంకులను కోరింది. అదే జరిగితే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వినియోగదారులు చెల్లించవలసిన ఈంఐలు త‌గ్గే అవ‌కాశం ఉంది.
First Published:  1 Jun 2015 6:56 PM IST
Next Story