మోడీని అరెస్టు చేస్తే రూ.100 కోట్లు!
భారత ప్రధాని నరేంద్ర మోడీని అరెస్టు చేసిన వారికి రూ.100 కోట్ల నజరానా ఇస్తామని పాకిస్థాన్‌కు చెందిన రాజకీయ పార్టీ జమాతే ఇస్లామీ అధినేత సిరాజ్ ఉల్ హక్ ప్రకటించాడు. సోమవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని రావల్‌కోట్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన సిరాజ్ మోడీపై నిప్పులు చెరిగాడు. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్‌ను పట్టుకున్నవారికి రూ. 50 కోట్లు ఇస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించిందని, అయినా భారత అధికారులు అతణ్ని పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశాడు. సలావుద్దీన్‌ను అరెస్టు చేయడం […]
BY sarvi1 Jun 2015 6:47 PM IST
sarvi Updated On: 2 Jun 2015 11:54 AM IST
భారత ప్రధాని నరేంద్ర మోడీని అరెస్టు చేసిన వారికి రూ.100 కోట్ల నజరానా ఇస్తామని పాకిస్థాన్‌కు చెందిన రాజకీయ పార్టీ జమాతే ఇస్లామీ అధినేత సిరాజ్ ఉల్ హక్ ప్రకటించాడు. సోమవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని రావల్‌కోట్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన సిరాజ్ మోడీపై నిప్పులు చెరిగాడు. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్‌ను పట్టుకున్నవారికి రూ. 50 కోట్లు ఇస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించిందని, అయినా భారత అధికారులు అతణ్ని పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశాడు. సలావుద్దీన్‌ను అరెస్టు చేయడం మీ వల్ల కాదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ సవాల్ విసిరాడు. మోడీని అరెస్టు చేసిన వారికి రూ.100 కోట్లు (పాక్ కరెన్సీ.. భారత కరెన్సీ ప్రకారం ఇది దాదాపుగా రూ.62.4 కోట్లు) ఇస్తాం’’ అని ప్రకటించాడు. కాశ్మీర్ పాకిస్థాన్‌లో భాగమని, భారత్‌తో స్నేహ సంబంధాలు కోరుకునే పాక్ రాజకీయ నేతలెవరైనా పాకిస్థాన్ ద్రోహులు కిందే భావిస్తామని, వారు కాశ్మీరీ ద్రోహులేనని పేర్కొన్నాడు. హిందుస్థాన్‌తో స్నేహం కోరుకునేవారు భారత్‌లోని ఢిల్లీ, ముంబాయికో వెళ్ళిపోవచ్చని, పాకిస్థాన్‌లో వారికి చోటు లేదని అన్నాడు.
Next Story