టీడీపీకి దూరంగా బీజేపీ!
మండలి ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీ టీడీపీని దూరంగా పెట్టింది. ఓటుకు నోటు ఎరచూపిన కేసులో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టు కావడంతో సోమవారం జరిగిన మండలి ఎన్నికల్లో టీడీపీకి ఓటేయలేదు. ఎవరి పక్షమూ వహించకుండా నోటాను ఆశ్రయించింది. అవినీతి రహిత దేశాన్ని నిర్మించాలని మోదీ భావిస్తున్న క్రమంలో టీడీపికి మద్దతిస్తే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట మంటగలుస్తుందని భావించడమే ఇందుకుకారణం. ఈ మేరకు పార్టీ ఢిల్లీ పెద్దలు ఇచ్చిన సూచనలతోనే బీజేపీ ఎమ్మెల్యేలే నోటాకు ఓటేశారని సమాచారం. రేవంత్‌రెడ్డికి న్యాయస్థానం […]
BY Pragnadhar Reddy2 Jun 2015 3:16 AM IST
X
Pragnadhar Reddy Updated On: 2 Jun 2015 5:06 AM IST
మండలి ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీ టీడీపీని దూరంగా పెట్టింది. ఓటుకు నోటు ఎరచూపిన కేసులో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టు కావడంతో సోమవారం జరిగిన మండలి ఎన్నికల్లో టీడీపీకి ఓటేయలేదు. ఎవరి పక్షమూ వహించకుండా నోటాను ఆశ్రయించింది. అవినీతి రహిత దేశాన్ని నిర్మించాలని మోదీ భావిస్తున్న క్రమంలో టీడీపికి మద్దతిస్తే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట మంటగలుస్తుందని భావించడమే ఇందుకుకారణం. ఈ మేరకు పార్టీ ఢిల్లీ పెద్దలు ఇచ్చిన సూచనలతోనే బీజేపీ ఎమ్మెల్యేలే నోటాకు ఓటేశారని సమాచారం. రేవంత్‌రెడ్డికి న్యాయస్థానం మండలి ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతించడంతో ఆయన సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. ఆయనలో ఏమాత్రం పశ్చాతాపం కనిపించ లేదు. పైపెచ్చు భారత జట్టుకు ప్రపంచ కప్ సాధించిన క్రికెట్ జట్టు కెప్టెన్‌లా నవ్వుతూ వచ్చాడు. అతనికి టీడీపీ ఎమ్మెల్యేలు యుద్ధవీరుడికి పలికినట్లు, స్వాగతం పలకడం, వారికి బీజేపీ నేతలు తోడవడంపై పలువురు విస్మయానికి గురయ్యారు. అవినీతి కేసులో అడ్డంగా దొరికినప్పటికీ, ఇలా నిస్సిగ్గుగా వ్యవహరించడం చూసి ప్రజలు సైతం ముక్కున వేలేసుకున్నారు. బీజేపీపైనా పలు విమర్శలు వచ్చాయి. కానీ, ఈలోగానే బీజేపీ తనపై వస్తున్న ప్రచారాన్ని పార్టీ పెద్దలు గుర్తించారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి ఓటేస్తే దేశవ్యాప్తంగా తమ ప్రతిష్ట మంటగలుస్తుందని భావించింది. అందుకే ఎమ్మెల్యేలు ఓటింగ్ వచ్చినప్పటికీ పెద్దల సూచనల మేరకు నోటాను ఆశ్రయించారు.
Next Story