గుండెకు మేలు చేసే బీన్స్
వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్‌ను తింటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బీన్స్‌లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు పెరగకుండా చూస్తాయి. సన్నబడడానికి ప్రయత్నించేవారు బీన్స్‌ని తీసుకోవడం వల్ల చాలా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. అరకప్పు బీన్స్‌లో ఏడు గ్రాముల ప్రొటీన్లు లభిస్తాయట. అంతేకాదు బీకాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లూ బీన్స్‌లో లభిస్తాయి. బీన్స్‌లో […]
BY Pragnadhar Reddy1 Jun 2015 9:30 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 2 Jun 2015 12:11 AM GMT
వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్‌ను తింటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బీన్స్‌లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు పెరగకుండా చూస్తాయి. సన్నబడడానికి ప్రయత్నించేవారు బీన్స్‌ని తీసుకోవడం వల్ల చాలా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. అరకప్పు బీన్స్‌లో ఏడు గ్రాముల ప్రొటీన్లు లభిస్తాయట. అంతేకాదు బీకాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లూ బీన్స్‌లో లభిస్తాయి. బీన్స్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే వీటిని ఉడికించిన తర్వాత కూడా వీటిలోని డెబ్బైశాతం పోషకాలు మిగిలే ఉంటాయి. బీన్స్ వల్ల కాలేయం, చర్మం, కళ్లు, వెంట్రుకలు వంటి అనేక భాగాలకు శక్తి అందుతుంది.
Next Story