Telugu Global
Others

ఎ-1 ముద్దాయి చంద్ర‌బాబు: గ‌వ‌ర్న‌ర్‌కు జ‌గ‌న్ ఫిర్యాదు

నోటుకు ఓటు కేసులో ప‌క్కా ఆధారాలున్నాయి కాబట్టి చంద్ర‌బాబుపై కేసు పెట్టేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌తో స‌మావేశ‌మైన సంద‌ర్భంగా తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అవినీతి వ్య‌వ‌హారంపై పూర్తి స్థాయి విచార‌ణ జ‌ర‌పాల‌ని, త‌న బాసు (చంద్ర‌బాబు) ఆదేశాల మేర‌కే తాను ఈ డీల్ కుద‌ర్చ‌డానికి వ‌చ్చాన‌ని స్ప‌ష్టంగా వీడియో, ఆడియోలో ఉన్నాయ‌ని, అలాంటప్పుడు ఎ-1 ముద్దాయిగా చంద్ర‌బాబు పేరు […]

ఎ-1 ముద్దాయి చంద్ర‌బాబు: గ‌వ‌ర్న‌ర్‌కు జ‌గ‌న్ ఫిర్యాదు
X
నోటుకు ఓటు కేసులో ప‌క్కా ఆధారాలున్నాయి కాబట్టి చంద్ర‌బాబుపై కేసు పెట్టేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌తో స‌మావేశ‌మైన సంద‌ర్భంగా తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అవినీతి వ్య‌వ‌హారంపై పూర్తి స్థాయి విచార‌ణ జ‌ర‌పాల‌ని, త‌న బాసు (చంద్ర‌బాబు) ఆదేశాల మేర‌కే తాను ఈ డీల్ కుద‌ర్చ‌డానికి వ‌చ్చాన‌ని స్ప‌ష్టంగా వీడియో, ఆడియోలో ఉన్నాయ‌ని, అలాంటప్పుడు ఎ-1 ముద్దాయిగా చంద్ర‌బాబు పేరు ఎందుకు పెట్ట‌కూడ‌ద‌ని అన్నారు. ఒక ఎమ్మెల్సీ గెల‌వాలంటే 18 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉండ‌గా ప‌ది మంది తెలుగుదేశం, ఐదుగురు బీజేపీ స‌భ్యుల‌తో ఎలా గెలిపించ‌గ‌ల‌మ‌ని వేం న‌రేంద్ర‌రెడ్డిని పోటీలో పెట్టారని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఐదో స్థానం కోసం టీఆర్ఎస్ పోటీ చేస్తే అంత యాగీ చేసిన ఆయ‌నకు ఇది త‌ప్ప‌నిపించ‌లేదా అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబుకు కావాల్సిన వారికే ప‌ట్టిసీమ టెండ‌ర్లు ద‌క్కాయ‌ని, ఈ టెండ‌ర్ల ద్వారా ల‌భించిన అవినీతి సొమ్మునే ఎమ్మెల్యేల కొనుగొళ్ళు వంటి అక్ర‌మాల‌కు ఉప‌యోగిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌కు ఇవ్వ‌జూపిన ఐదు కోట్ల రూపాయ‌లు తెలుగుదేశం అధినేత‌కు ఎలా వ‌చ్చాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాము టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తిస్తే చంద్ర‌బాబుకు అభ్యంత‌ర‌మెందుకో త‌న‌కు అర్ధం కావ‌డం లేద‌ని, త‌మ మ‌ద్ద‌తు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వ‌ర‌కే ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
వైఎస్ఆర్ సీపీ ఎప్పుడైనా… ఎక్క‌డున్నా ఒకే మాట మాట్లాడుతుంద‌ని, చంద్ర‌బాబులా రెండు క‌ళ్ళ సిద్ధాంతం మాదిరిలా అక్క‌డో మాట‌…. ఇక్క‌డో మాట మాట్లాడ‌ద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. స‌మైక్య రాష్ట్రంలో చంద్ర‌బాబు విప్ జారీ చేసి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి స‌ర్కారును కాపాడార‌ని, అది త‌ప్పు కాన‌ప్పుడు తాను టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తివ్వ‌డం ఎలా త‌ప్ప‌వుతుంద‌ని ప్ర‌శ్నించారు. ఎమ్మెల్యేల‌ను సంతలో ప‌శువులుగా కొంటున్నార‌ని, చంద్ర‌బాబుకు ఇలాంటివి అల‌వాటేన‌ని, ఇలాంటి వైఖ‌రి అవ‌లంభిస్తున్న రాజ‌కీయ పార్టీల‌కు బుద్ధి చెప్పాల్సింది ప్ర‌జ‌లేన‌ని ఆయ‌న విమ‌ర్శించారు.
First Published:  2 Jun 2015 7:48 AM IST
Next Story