చంద్రబాబూ ముద్దాయే: ఉండవల్లి
ఎమ్మెల్యే ఓటు కొనుగోలుకు ప్రయత్నించిన కేసులో చంద్రబాబును కూడా ముద్దాయిగా పెట్టాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఇన్నాళ్లూ కాంట్రాక్టర్లు, అధికారుల అవినీతి మీదే దృష్టిపెట్టిన ఏసీబీ.. ఇక మీదట రాజకీయ అవినీతి మీద కూడా దృష్టిపెట్టి.. దీన్ని సమూలంగా నిర్మూలించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత రాజకీయాల్లో కేంద్రస్థాయిలో ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబుకు ఏజెంటుగా తాను వచ్చానని రేవంత్ రెడ్డి లాంటి కీలక నాయకుడు స్పష్టంగా […]
BY sarvi1 Jun 2015 11:55 AM IST
X
sarvi Updated On: 1 Jun 2015 12:44 PM IST
ఎమ్మెల్యే ఓటు కొనుగోలుకు ప్రయత్నించిన కేసులో చంద్రబాబును కూడా ముద్దాయిగా పెట్టాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఇన్నాళ్లూ కాంట్రాక్టర్లు, అధికారుల అవినీతి మీదే దృష్టిపెట్టిన ఏసీబీ.. ఇక మీదట రాజకీయ అవినీతి మీద కూడా దృష్టిపెట్టి.. దీన్ని సమూలంగా నిర్మూలించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత రాజకీయాల్లో కేంద్రస్థాయిలో ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబుకు ఏజెంటుగా తాను వచ్చానని రేవంత్ రెడ్డి లాంటి కీలక నాయకుడు స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యమైన విషయమని స్వయంగా న్యాయవాది కూడా అయిన ఉండవల్లి చెప్పారు. ఇది మాత్రం చాలా బలమైన కేసు అవుతుందని ఆయన అన్నారు. రేవంత్ చెప్పిన మాటల్లో చంద్రబాబు ప్రస్తావన ఉందని, ఆపరేషన్ జరుగుతున్నట్లు తెలియకుండా మాట్లాడినప్పుడు అందులో ఎక్కువగా వాస్తవం ఉందనే భావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు ఇచ్చినట్లు ప్రజలైతే నమ్మారని, అదే ఆ పార్టీకి పెద్ద దెబ్బ అవుతుందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. గతంలో ఇలాంటి కేసులోనే పీవీ నరసింహరావును కూడా ముద్దాయిగా చేశారని ఉండవల్లి గుర్తు చేశారు.
Next Story