తగ్గిన ఎండలు... తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
ఉపరతల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వారు తెలిపారు. దీని ప్రభావంగా పలు జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి చినుకులు పడనున్నాయి. సోమవారం ఉదయం నుంచి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక మోస్తరు భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, నర్సాపురం, […]
BY sarvi1 Jun 2015 9:05 AM IST
X
sarvi Updated On: 1 Jun 2015 9:05 AM IST
ఉపరతల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వారు తెలిపారు. దీని ప్రభావంగా పలు జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి చినుకులు పడనున్నాయి. సోమవారం ఉదయం నుంచి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక మోస్తరు భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, నర్సాపురం, తణుకులో భారీ వర్షం కురిసింది., జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఆకివీడుల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో అంబాజీపేట, కోనసీమ ప్రాంతాలు కృష్ణా జిల్లా విజయవాడ, జగ్గయ్యపేట, నూజివీడు, నందిగామ ఓ మోస్తరు వర్షం కురిసింది. అయితే మచిలీపట్నంలో భారీ వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఉంది. కర్నూలు జిల్లాలో అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాబోయే 24 గంటల్లో కూడా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Next Story