Telugu Global
Others

9న ఢిల్లీ ఆగ్రా మధ్య సెమీ హైస్పీడ్‌ రైలు

ఢిల్లీ-ఆగ్రాల మధ్య త్వరలో సెమీ హైస్పీడ్‌ రైలు పరుగులు తీయనుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ను వచ్చే నెల రెండోవారంలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 200 కిలోమీటర్ల దూరమున్న ఈ రెండు స్టేషన్ల నడుమ ఇప్పటికే రెండుసార్లు ట్రయల్‌రన్‌ నడిచింది. కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ(సీఆర్‌ఎస్) నుంచి ఏ క్షణంలోనైనా ఆమోదం లభించొచ్చని, జూన్‌ 9న ఈ సర్వీసును ప్రారంభిస్తామని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

First Published:  31 May 2015 7:10 PM IST
Next Story