Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 100

ఒక రచయిత దూరదర్శన్‌ ఆఫీసులోకి దూసుకుపోయి ఆఫీసర్‌ దగ్గరికి వెళ్ళి “సార్! టెలివిజన్‌ కోసం ఒక అద్భుతమైన, కొత్త ఆలోచనల్తో నిండిన, మనుషుల్లో చైతన్యం కలిగించే కథ సిద్ధం చేశాను సార్‌” అన్నాడు. ఆఫీసర్‌ అతన్ని ఎగాదిగా చూసి “నీకేమైనా పిచ్చిపట్టిందా? ఇది దూరదర్శన్‌. గెటౌట్‌ ”అన్నాడు. ————————————————– సినిమాలకు రద్దీ లేకపోవడంతో ఒక థియేటర్‌ ముందు బోర్డు పెట్టారు రిటైరయిన వాళ్ళకు మాట్నీ ఫ్రీ – వాళ్ళ పిల్లల్తో కలిసి వస్తే! ————————————————– ఒకమ్మాయి అబిడ్స్‌ […]

ఒక రచయిత దూరదర్శన్‌ ఆఫీసులోకి దూసుకుపోయి ఆఫీసర్‌ దగ్గరికి వెళ్ళి
“సార్! టెలివిజన్‌ కోసం ఒక అద్భుతమైన, కొత్త ఆలోచనల్తో నిండిన, మనుషుల్లో చైతన్యం కలిగించే కథ సిద్ధం చేశాను సార్‌” అన్నాడు.
ఆఫీసర్‌ అతన్ని ఎగాదిగా చూసి “నీకేమైనా పిచ్చిపట్టిందా? ఇది దూరదర్శన్‌. గెటౌట్‌ ”అన్నాడు.
————————————————–
సినిమాలకు రద్దీ లేకపోవడంతో ఒక థియేటర్‌ ముందు బోర్డు పెట్టారు
రిటైరయిన వాళ్ళకు మాట్నీ ఫ్రీ – వాళ్ళ పిల్లల్తో కలిసి వస్తే!
————————————————–
ఒకమ్మాయి అబిడ్స్‌ బస్‌ స్టాప్‌లో ఉంటే స్పీడుగా కారు డ్రైవ్‌ చేసుకుంటూ వచ్చిన కుర్రాడు సడన్‌ బ్రేక్‌ వేసి ఆపి ఆ అమ్మాయిని చూసి “జూబ్లీహిల్స్‌ వేపు వెళుతున్నా” అన్నాడు.
ఆ అమ్మాయి “ఓకే! వెళ్ళు! వచ్చేటప్పుడు మంచి ఐస్‌క్రీం పట్రా” అంది.

—————————————————–
మా కుక్కకు బాగా ట్రైనింగ్‌ ఇచ్చాం. బంతి విసిరితే తిరిగి తెచ్చిస్తుంది.
మా ఆవిడ పొద్దున్నే పేపర్‌ వస్తే అది కూడా తెచ్చివ్వడం నేర్పింది.
ఈ అనుభవంతో అది చాలా తెలివిగల కుక్కగా మారింది. నిన్నరాత్రి మా పై గదిలోకి దొంగ దూరితే వాడికి టార్చిలైటు తెచ్చిచ్చింది!

First Published:  31 May 2015 6:33 PM IST
Next Story